వీడియో: చుట్ట‌మ‌ల్లే.. విదేశీ జంట డ్యాన్సుల‌కు షాక్

ఇటీవ‌లే చుట్ట‌మ‌ల్లే .. అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

Update: 2024-08-11 12:38 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - జాన్వీ క‌పూర్ జంట‌గా కొర‌టాల శివ తెర‌కెక్కించిన `దేవ‌ర` ఈ ఏడాది సెప్టెంబ‌ర్ చివ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌చారంలో వేగం పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే చుట్ట‌మ‌ల్లే .. అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ పాట‌లో ఎన్టీఆర్- జాన్వీ క‌పూర్ రొమాన్స్ కుర్ర‌కారు హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. ఇది కేవ‌లం ఇండియాలోనే కాదు విదేశాల్లోను మార్మోగుతోంది.

తార‌క్- జాన్వీ స్టెప్పుల‌ను అనుక‌రించేందుకు విదేశీ యువ‌త ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది. `చుట్ట‌మ‌ల్లే..` పాట‌కు విదేశీ జంట డ్యాన్సింగ్ వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమానులను ఇది విస్మయానికి గురి చేసింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్‌లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ ల ప‌వ‌ర్ ఎలా ఉంటుందో ఆర్.ఆర్.ఆర్ తో విదేశీయుల‌కు అర్థ‌మైంది. ఆర్.ఆర్.ఆర్ `నాటు నాటు`లో జూనియ‌ర్ ఎన్టీఆర్- చ‌ర‌ణ్ స్టెప్పుల‌కు అద్భుత‌మైన‌ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

ఇప్పుడు ఈ విదేశీ జంట తార‌క్ న‌టిస్తున్న `దేవ‌ర‌` పాట‌లోని గ్లింప్స్ ని క్యాచ్ చేసి దానిని అనుక‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో పాటు, అభిమానులను థ్రిల్ చేయ‌డ‌మే గాక‌ షాక్‌కు గురి చేసింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారిలో ఈ వీడియో ఉత్కంఠ రేపింది.

దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్నారు. విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్ర‌చారంలో వేగం పెరుగుతోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌లో ఒక‌టిగా విడుద‌ల‌వుతున్న `దేవ‌ర` ఏ మేర‌కు వ‌సూళ్ల‌ను సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News