పవర్ స్టార్ బ్రాండ్ తో బండ్లన్న.. నాగబాబుకే ధీటుగా..
టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో హాట్‌టాపిక్‌గా మారుతుంటారు.
టాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో మీడియాలో హాట్‌టాపిక్‌గా మారుతుంటారు. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారారు. అది కూడా మెగా యూక్టర్ నాగబాబుతో పోటీకి దిగి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచారు!
తాజాగా బండ్ల గణేశ్.. ఓ గుడ్ న్యూస్ ట్వీట్ పోస్ట్ చేశారు. కానీ అది కాస్త చర్చనీయాంశమైంది. దాదాపు 10 ఏళ్ల పాటు వరుస పరాజయాలతో ఉన్న టైమ్‌లో పవన్ కల్యాణ్‌కు 'గబ్బర్ సింగ్' మూవీ ఎంతటి హిట్‌ను అందించిందో తెలిసిన విషయమే. పవన్ కల్యాణ్‌కు మంచి బూస్ట్ ఇవ్వడమే కాకుండా.. ఇండస్ట్రీలో పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఆ సినిమాకు బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు.
అయితే సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు. దీంతో ఆ రోజు గబ్బర్ సింగ్ రీరిలీజ్ చేయనున్నట్లు బండ్ల గణేశ్ ప్రకటిస్తూ పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు సంతోషపడిపోయారు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని.. పవర్ స్టార్ కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచిన 'గుడుంబా శంకర్'ను.. ఆ చిత్ర నిర్మాత, మెగా యాక్టర్ నాగబాబు కూడా రిలీజ్ చేయనున్నట్లు అంతకుముందే అనౌన్స్ చేశారు. గుడుంబా శంకర్ రీరిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నారని తెలిపారు.
అయితే బండ్ల ట్వీట్‌తో మళ్లీ నాగబాబు.. తన సినిమాను ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1న ప్రదర్శించబోతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అభిమానులు ఓ వైపు పవన్ పుట్టినరోజుకు డబుల్ బొనాంజ అంటూ సంబరపడిపోతున్నప్పటికీ.. మరి కొందరూ అది కరెక్ట్ కాదని అంటున్నారు. రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్స్ తగ్గే అవకాశముందని, అయినా నాగబాబుకు పోటీగా బండ్ల గణేశ్ సినిమా రీరిలీజ్‌ను అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.
ఆ మధ్యలో చాలా తక్కువ వ్యవధిలో తమ్ముడు, జల్సా సినిమాలను ఒకసారి రీరిలీజ్ చేశారు. ఆ సమయంలో పెద్ద రికార్డులేమి రాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పుడు గుడుంబా శంకర్-గబ్బర్ సింగ్ విషయంలో కూడా ఇలానే జరిగే అవకాశముందని, బండ్లన్న కాస్త ఇది తెలుసుకుని వెనక్కి తగ్గిటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.