గేమ్ చేంజర్ స్టైలిష్ సాంగ్… చిన్న క్లిప్పుతోనే కిక్కిచ్చారుగా
డోప్ అంటూ సాగే ఈ సాంగ్ ని డిసెంబర్ 21న యూఎస్ లో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారంట.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి సంక్రాంతి కానుకగా జనవరి 10న రాబోతున్న గేమ్ చేంజర్ పై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇక ప్రమోషన్స్ ని మేకర్స్ షురూ చేశారు. ఈ సినిమాని వీలైనంత స్ట్రాంగ్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొని వెళ్లాలని దిల్ రాజు భావిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అన్ని భాషలలో కూడా ప్రేక్షకులని ఈ చిత్రాన్ని చేరువ చేయాలని అనుకుంటున్నారు. సినిమాపై ఇప్పటి వరకు అయితే చెప్పుకోదగ్గ బజ్ లేదు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ తో పాటు మూడు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వీటిలో రీసెంట్ గా వచ్చిన నానా హైరానా అనే మెలోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన స్టైల్ లోనే మాస్ అండ్ క్లాస్ బీట్స్ తో సాంగ్స్ సందడి చేశాయి. అయితే ఎక్కువ రోజులు గుర్తుంచుకునే విధంగా లేవనే మాట వినిపిస్తోంది. అయితే ఈ సాంగ్స్ లో శంకర్ ప్రెజెంటేషన్ గ్రాండ్ గా ఉండబోతోందని అర్ధమవుతోంది.
శంకర్ సినిమాలు అంటే సాంగ్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా అతని సినిమాలో సాంగ్స్ విజువలైజేషన్ ఉంటుంది. ‘గేమ్ చేంజర్’ లో కూడా శంకర్ మ్యాజిక్ ఉండబోతోందని అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో సింగిల్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. డోప్ అంటూ సాగే ఈ సాంగ్ ని డిసెంబర్ 21న యూఎస్ లో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారంట.
ఇప్పటికే ఈ ఈవెంట్ కి సంబందించిన ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి. మూవీ క్యాస్టింగ్ అండ్ క్రూ మొత్తం ఈ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళబోతున్నారు. ఈ ఈవెంట్ నుంచి ‘గేమ్ చేంజర్’ ప్రమోషన్స్ మరింత స్పీడ్ అప్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ డోప్ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ అందించారు. ఈ పాటకి జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేశారు.
మరి ఈ సాంగ్ ఏ మేరకు సినిమాకి ఊపు తీసుకొస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు. ఎస్ జె సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించాడు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి శంకర్ వారి నమ్మకాన్ని ఎంత వరకు నిలబెడతాడనేది వేచి చూడాలి.