గేమ్ ఛేంజర్… దిల్ రాజు న్యూ స్ట్రాటజీ
షూటింగ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోయే ‘గేమ్ చేంజర్’ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సుమారుగా మూడేళ్ళ నుంచి షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మొదటి తెలుగు పాన్ ఇండియా మూవీ కావడంతో దీనిపై కొంత హోప్స్ ఉన్నాయి. దిల్ రాజు కూడా సినిమాపై భారీగానే ఖర్చు పెట్టారు. షూటింగ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని మార్కెట్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం మేకర్స్ మొదలెట్టారు. ఇప్పటికే రా మచ్చా సాంగ్ కి గత నెలలో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. అయితే మూవీకి భారీ హైప్ రావాలంటే అది సరిపోదని ఫ్యాన్స్ భావించారు. టీజర్ రిలీజ్ గురించి చిత్ర యూనిట్ చాలా రోజుల నుంచి ఊరిస్తూ వచ్చింది. ఎట్టకేలకి లక్నోలో భారీ ఈవెంట్ నిర్వహించి ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్ చేశారు.
నిజానికి పాన్ ఇండియా సినిమాల ఈవెంట్స్ హైదరాబాద్ లేదంటే చెన్నై, బెంగుళూరు, ముంబై లాంటి సిటీస్ లో నిర్వహిస్తూ ఉంటారు. దిల్ రాజు మాత్రం అనూహ్యంగా లక్నో వేదికగా ఈ మూవీ టీజర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి దిల్ రాజు, రామ్ చరణ్, ఎస్ జె సూర్య, కియారా అద్వానీ, అంజలి హాజరయ్యారు. చాలా గ్రాండ్ గా ఈవెంట్ జరిగింది. టీజర్ కి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ టీజర్ ఏ మేరకు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.
లక్నోలో టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం మైనస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ లాంచింగ్ ఈవెంట్ కి భారీ ఎత్తున ఫ్యాన్స్, సినీ ప్రియులు హాజరయ్యారు. ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దీనికి కారణం ఉంది. లక్నోలో ఈవెంట్ నిర్వహించడం వలన అటు నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని కవర్ చేసేసారు. అలాగే లక్నోలో తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు. స్టడీస్ కోసం అక్కడ చాలా మంది స్టే చేస్తున్నారు.
వారు కూడా భారీ ఎత్తున ఈవెంట్ కి వచ్చారు. మొదటి సారి లక్నోలో ఒక పాన్ ఇండియా సినిమా ఈవెంట్ జరగడంతో ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఓవరాల్ గా దిల్ రాజు ప్రమోషనల్ స్ట్రాటజీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని మీడియా సర్కిల్ లో వినిపిస్తోంది. ‘గేమ్ చేంజర్’ క్రేజ్ నార్త్ ఇండియాకి బలంగా పాకిందనే ప్రచారం జరుగుతోంది. నెక్స్ట్ ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా నార్త్ ఇండియా ప్రధాన పట్టణాలలో నిర్వహించడానికి దిల్ రాజు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.