గేమ్ ఛేంజర్.. మళ్ళీ మూడు టార్గెట్లు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

Update: 2024-04-02 01:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు సినిమాకు సరైన కంటెంట్ తో పాజిటివ్ హైప్ క్రియేట్ చేయకపోయినప్పటికీ ఈ కాంబినేషన్ పైనే భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన జరగండి పాట కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు.

ఇక రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి కంటెంట్ తో బజ్ క్రియేట్ చేస్తారు అని నమ్మకంతో ఉన్నారు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న శంకర్ సినిమా కాబట్టి కథలో మంచి కంటెంట్ ఉంటుంది అని ఆశతో కూడా ఉన్నారు. ఇక శంకర్ ఒకవైపు గేమ్ చేంజర్ పనుల్లో వేగాన్ని పెంచుతున్నప్పటికీ మరోవైపు ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉండడం వలన రిలీజ్ డేట్ పై సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.

దిల్ రాజు కూడా ఇప్పటికే ఈ విషయంలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తిగా శంకర్ చేతిలోనే రిలీజ్ డేట్ ఆధారపడి ఉంది అని ఆయన ఏప్పుడు చెబితే అప్పుడు రిలీజ్ పై క్లారిటీ ఇస్తానని కూడా అన్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం గేమ్ ఛేంజర్ సినిమాకు మరొక మూడు టార్గెట్స్ సెట్ అయినట్లుగా తెలుస్తోంది.

మొదట ఈ సినిమాను సమ్మర్ లోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో ప్రమోషన్స్ కూడా సమయం సరిపోదు అని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జూలై నాటికి ఫినిష్ అవుతుందట. ఇక ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ కోసం సమయం సెట్ చేసుకొని సినిమాను సాఫీగా విడుదల చేయాలని అనుకుంటున్నారు.

మొదటి టార్గెట్ అయితే డిసెంబర్. లేదంటే అంతకంటే ముందు కూడా సినిమాను తీసుకువచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ రెండో వారం తర్వాత పోటీగా వచ్చే పెద్ద సినిమాలు ఏమీ కనిపించడం లేదు. కాబట్టి గేమ్ ఛేంజర్ కు అక్టోబర్ రెండవ వారం తర్వాత గాని నవంబర్ లో గానీ విడుదల చేస్తే బెటర్ అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

అక్టోబర్ 10న జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కాబట్టి ఆ సినిమాతో పోటీ ఉండకుండా నవంబర్ లోనే గేమ్ చేజర్ ను దింపితే బెటర్ అని మరికొందరు సజెస్ట్ చేస్తున్నారట. ఒకవేళ నవంబర్ లో కుదరకపోతే డిసెంబర్లో గాని సినిమాను విడుదల చేయాలి అని ఆలోచనతో ఉన్నారు. ఈ మూడు నెలల్లో ఏ డేట్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు అని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని ఫాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి దర్శకుడు శంకర్ ఈ విషయంలో ఎప్పుడు సమాధానం ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News