గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఫస్ట్ డే సాలీడ్ కలెక్షన్స్!
యూత్ లో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విశ్వక్ సేన్ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు.
యూత్ లో మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న విశ్వక్ సేన్ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబందం లేకుండా దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్ ఫార్చున్ ఫోర్ సినిమాస్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక విశ్వాక్ కెరీర్ లో లోన్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందికున్న ఈ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే క్రిటిక్స్ దగ్గర మిక్స్ డ్ ఒపీనియన్ వచ్చిన కూడా కలెక్షన్స్ మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. తన స్టార్ ఇమేజ్ తో విశ్వక్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు.
వచ్చే 2 రోజులు కూడా కలెక్షన్స్ ఇలానే ఉంటే సోమవారం నాటికి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పవచ్చు. విశ్వక్ తన ప్రతీ సినిమాతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చాలా తొందరగానే అందుకుంటూ ఉన్నాడు. ఇక ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి కూడా అదే తరహాలో రెస్పాన్స్ వస్తోంది కాబట్టి టార్గెట్ ఫాస్ట్ గానే రీచ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ బీజీఎం కు సాలీడ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇక లంకల రత్న అనే క్యారెక్టర్ లో విశ్వక్ పెర్ఫామెన్స్ కు మాస్ ఆడియెన్స్ ను విజిల్స్ గట్టిగానే పడుతున్నాయి. సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఎడిటింగ్ మైనస్ మరియు సెకండ్ హాఫ్ కొన్ని మైనస్ లు ఉన్నా సినిమా అయితే బాగానే ఆకట్టుకుంటుంది. ఇక బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదటి రోజు వచ్చిన షేర్ కలెక్షన్స్
నైజాం - 1.10 కోట్లు
వైజాగ్ - 46 లక్షలు
ఈస్ట్ - 28 లక్షలు
వెస్ట్ - 24 లక్షలు
గుంటూరు - 30 లక్షలు
నెల్లూరు - 17 లక్షలు
కృష్ణ - 21 లక్షలు
సీడెడ్ - 76 లక్షలు