TNR మా ఢిల్లీని లూటీ చేసాడంట! గాయత్రి భరద్వాజ్
మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తోన్న `టైగర్ నాగేశ్వరరావు` తో కొత్త అందం గాయత్రి భరద్వాజ హీరోయిన్ గా పరిచయమవుతోంది.
మాస్ మహారాజా రవితేజ కథనాయకుడిగా నటిస్తోన్న `టైగర్ నాగేశ్వరరావు` తో కొత్త అందం గాయత్రి భరద్వాజ హీరోయిన్ గా పరిచయమవుతోంది. అమ్మడు అందానికి ఫిదా అవ్వాల్సిందే. ఇప్పటికే ఇలియానాకి అచ్చు గుద్దిన అందంలా ఉందంటూ ప్రశంసలందుకుంటుంది. ఇలియానా అంత హైట్ లేకపోయినా ముఖంలా చాలా పీచర్స్ ఆమెని పోలడంతో! ఇలా ఫేమస్ అవుతుంది. రిలీజ్ కి మందే ఈ రకమైన ప్రచారం బ్యూటీకి బాగానే కలిసొస్తుంది.
మరి ` టైగర్ నాగేశ్వరరావు` లో అవకాశం రావడానికి ఇదీ ఓ కారణమా? అన్నది తెలియదు గానీ... తెలుగులో మాత్రం ఇది మొదటి అవకాశం కాదంటోంది గాయత్రి. ఈ సినిమాకంటే ముందే మరోసినిమాలో నటించే అవకాశం వచ్చిందిట. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయిందిట. ఒక వేళ అప్పుడు ఆ సినిమా తాను చేసి ఉంటే ఇప్పుడు నాగేశ్వరరావు తో నటించే అవకాశం వచ్చేది కాదని సంతోషం వ్యక్తం చేసింది.
` ఇందులో ఛాన్స్ రావడం అన్నది నా లక్ అనే అనాలి. ఈ సినిమా కోసం దర్శకుడు 60 మందిని ఆడిషన్ చేసారుట. అంత మందిని కాదని నా వరకూ అవకాశం వచ్చిందంటే అదృష్టమనే అంటాను. నా కళ్లు భావాల్ని పలికించేలా ఉంటాయని అంటారు. అవకాశం రావడానికి అదే కారణం. ఇక రవితేజ చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన సినిమాలు హిందీలో డబ్ అయ్యాయి. కానీ ఎప్పుడూ ఒక్క సినిమా కూడా చూడలేదు. కానీ ఆయనతో నటించే ఛాన్స్ రాగానే థ్రిల్ పీలయ్యా.
సెట్లోకి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గురించి తెలిసింది. ఆయన మా ఢిల్లీ లో కూడా దొంగతనాలు చేసారుట. ఆ విషయాలు తెరపై చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ఇక నేను రామ్ చరణ్ కి వీరాభిమానిని. ఆస్వార్ వచ్చినప్పుడు ఇంత గొప్ప పరిశ్రమలో పనిచేస్తానానా? అనిపించింది. మా నాన్న పైలెట్..అమ్మ సైకాలజిస్ట్.. ఏడేళ్ల వయసులోనే ర్యాంప్ వాక్ చేసా. అలా గ్లామర్ ప్రపంచలోకి ప్రవేశించాను. ఇటీవలే మరో సినిమాకి సంతకం చేసా. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తా` అంది.