చీరలో ఉప్పెన పాప.. హై గ్లామర్ ట్రీట్
తాజాగా కృతి, పింక్ కలర్ చీరలో కనువిందు చేస్తూ, ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంటోంది.
గ్లామరస్ బ్యూటీ కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమా ద్వారా యూత్‌లో ఫేవరెట్ హీరోయిన్గా మారిన కృతి, ఆ తర్వాత వరుసగా మంచి అవకాశాలు అందుకుంది. కానీ, ఆ సినిమాల ఫలితాలు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో కెరీర్లో కొంత తగ్గుదల కనిపించింది.
ఉప్పెన తర్వాత నాని తో చేసిన శ్యామ్ సింగరాయ్, నాగ చైతన్య తో చేసిన బంగార్రాజు సినిమాలు సక్సెస్ సాధించినా, ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం, వారియర్, కస్టడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే, సినిమాల పరంగా వచ్చిన ఈ కష్టాలను పక్కన పెడితే, కృతి శెట్టి సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా తన క్రేజ్‌ను నిలబెట్టుకుంది.
ఇటీవల తన గ్లామర్ ఫోటోషూట్స్‌తో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటూ వస్తోంది. పలు స్టైలిష్ ఔట్ఫిట్స్లో కృతి తన గ్లామర్‌ను నూతన పంథాలో చూపిస్తూ ఫ్యాషన్ లవర్స్‌ని, యూత్‌ని ఎంతగానో ఆకర్షిస్తోంది. తాజాగా కృతి, పింక్ కలర్ చీరలో కనువిందు చేస్తూ, ఫ్యాన్స్ హృదయాలను దోచుకుంటోంది. ఆమె బాడీ లాంగ్వేజ్, సున్నితమైన నడుము, చిరునవ్వుతో ఫోటోలో మరింత గ్లామర్‌ను మెరిసేలా చేస్తోంది.
సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ప్రతి ఫోటో వైరల్ అవుతూ, అభిమానుల నుంచి మంచి స్పందనను రాబడుతోంది. కృతి పిక్స్‌కు నెటిజన్లు "బేబమ్మ అదుర్స్", "సూపర్ గ్లామర్" అంటూ కామెంట్లతో ప్రేమను చాటుతున్నారు. ఇప్పటికే తమిళ, మలయాళ చిత్రాల్లో పలు ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న కృతి, తెలుగు సినిమాల్లో తిరిగి అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో అమ్మడికి ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.