గాడ్జిల్లా Vs కాంగ్ : ది న్యూ ఎంపైర్ టాక్ ఏంటి..?
ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి అంటే పాతాళంలో ఒక ప్రదేశంలో హోలో ఎర్త్ అనే నివాసం ఏర్పరచుకుని కాంగ్ ఉంటుంది.
హాలీవుడ్ సినిమాల్లో సూపర్ హీరోలు చేసే హంగామా ఒక రేంజ్ లో ఉంటే వాటికి ఏమాత్రం తగ్గకుండా యానిమల్స్ తో చేసే యానిమేషన్ సినిమాలు కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటాయి. జురాసిక్ పార్క్ నుంచి అలాంటి సినిమాలకు ఎక్కువ పాపులారిటీ రాగా ఆ తర్వాత కింగ్ కాంగ్, గాడ్జిల్లా సినిమాలు వరల్డ్ సినీ లవర్స్ ని మెప్పించాయి. సూపర్ హీరోల మూవీస్ ఎంత పాపులర్ అవుతాయో ఈ భయంకరమైన రాకాసి జంతువుల సినిమాలు కూడా అదే రేంజ్ సక్సెస్ లు అందుకుంటాయి.
ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయి. భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం చూసే సినిమాల్లో ఈ యానిమల్ మూవీస్ ఉంటాయని చెప్పొచ్చు. అందుకే వాటికి సీరీస్ లు, సీక్వల్స్ అలా చేస్తూనే ఉంటారు. లేటెస్ట్ గా అలాంటి ఒక సూపర్ హిట్ సీరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్. ఫ్రైడే రిలీజైన ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో రిలీజైంది.
ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి అంటే పాతాళంలో ఒక ప్రదేశంలో హోలో ఎర్త్ అనే నివాసం ఏర్పరచుకుని కాంగ్ ఉంటుంది. ఓ పక్క టైటిల్స్ ని ఎదుర్కుంటూ గాడ్జిల్లా కాపు కాస్తుంది. పరిశోధనలు చేసే మోనార్క్ సంస్థ గ్రావిటీకు సంబందించి కొన్ని క్లూస్ తెలుసుకుంటారు. ప్రమాదకరమైన వాటి వల్ల మనుషులకు తీవ్ర నష్టం కలుగుతుందని భావించి వారిని కాపాడమని హోలో ఎర్త్ కి ఒక టీం వెళ్తుంది. అయితే అక్కడ రాక్షస కోతులు, జలచరాల ల నుంచి మనుషులను గాడ్జిల్లా, కాంగ్ ఎలా కాపాడాయి అన్నదే సినిమా కథ.
కామన్ గా ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారికి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ సినిమా ఓకే అనిపిస్తుంది. ఆడం విన్ గార్డ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రన్ టైం కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. 2 గంటల లోపే ఉన్న ఈ సినిమా అక్కడక్కడ కాస్త అటు ఇటుగా ఉన్నా నిడివి తక్కువ వల్ల ఓకే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనే కొంత స్లో అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం మెప్పించేలా చేశారు. 1933 నుంచి ఇప్పటివరకు కింగ్ కాంగ్ సీరీస్ లు 9 దాకా వచ్చాయి. ప్రస్తుతం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ సినిమా 10వ సీరీస్.