విలన్ గా నటించేందుకు ఓకే.. ఒక కండీషన్‌!

అయినా కచ్చితంగా మా సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ను ఇద్దరూ వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-10-05 19:30 GMT

గోపీచంద్‌ హీరోగా కావ్యా థాపర్‌ హీరోయిన్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. గోపీచంద్‌ గత కొంత కాలంగా సక్సెస్ లను దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. మరో వైపు దర్శకుడు శ్రీనువైట్ల దూకుడు తర్వాత సాలిడ్‌ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాడు. అలాంటి వీరి కాంబోలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి ఉంది. అయినా కచ్చితంగా మా సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం ను ఇద్దరూ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గోపీచంద్‌ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాక్యలు చేశారు.

విశ్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో గోపీచంద్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. గతంలో విలన్ గా నటించిన గోపీచంద్‌ మళ్లీ విలన్ గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి విలన్ గా మళ్లీ మిమ్ములను ఎప్పుడు చూస్తాం అంటూ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రశ్నించిన సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ సినిమాలో అయితేనే నేను విలన్‌ పాత్రను చేస్తాను. మరే సినిమాలోనూ విలన్ పాత్రను చేసేందుకు ఒప్పుకోను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రభాస్ సినిమా లో గతంలో వర్షం లో విలన్ గా గోపీచంద్‌ చేశాడు.

ప్రభాస్ తో వర్షంలో విలన్‌ గా నటించిన తర్వాత గోపీచంద్‌ హీరోగా మళ్లీ సినిమాలు చేసి హిట్‌ కొట్టాడు. అప్పటి నుంచి ప్రభాస్ తో అత్యంత సన్నిహిత సంబంధాలను గోపీచంద్‌ కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. కనుక ముందు ముందు విలన్‌ గా నటిస్తే కేవలం ప్రభాస్ సినిమాలో మాత్రమే చేస్తాను అంటూ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్‌ తో పాటు అంతా కూడా గోపీచంద్‌, ప్రభాస్ కాంబో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ప్రభాస్ సినిమాల్లో ఏదో ఒక దాంట్లో గోపీచంద్‌ నటిస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

గోపీచంద్‌ కెరీర్ ఆరంభంలో తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో జయం, నిజం, వర్షం సినిమాల్లో విలన్‌ గా నటించాడు. అత్యంత క్రూరమైన విలన్ పాత్రల్లో అద్భుతంగా నటించడం ద్వారా గోపీచంద్‌ కి మంచి పేరు వచ్చింది. అందుకే మళ్లీ మళ్లీ గోపీచంద్‌ ను విలన్ గా చూడాలి అనుకునే వారు ఎక్కువగా ఉన్నారు. తనను విలన్ గా నచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే వారు మళ్లీ నా నుంచి అలాంటి పాత్రలు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి నేను పూర్తిగా హీరోగా సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. ప్రభాస్‌ తో విలన్ గా నటించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తాను అంటూ ఆ ఇంటర్వ్యూలో గోపీచంద్‌ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News