బాలయ్య హిట్‌ కాంబో రిపీట్‌...!

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు.

Update: 2024-09-11 11:30 GMT

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. 'అఖండ' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలు హిట్‌ అవ్వడంతో ఆయన నుంచి రాబోతున్న సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే బాబీ దర్శకత్వంలో బాలయ్య 109వ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఆ సినిమాను డిసెంబర్‌ లో లేదా జనవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో సినిమా పూర్తి అయిన వెంటనే 'అఖండ' దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా మొదలు పెట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలు వచ్చి హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి కాంబోలో రాబోతున్న నాల్గవ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బోయపాటి ప్రస్తుతం అఖండ 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ ను చేస్తున్నాడు. అతి త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది.

ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే బాలయ్య మూడో సినిమాను కన్ఫర్మ్‌ చేశాడు. వీరసింహా రెడ్డి సినిమాతో దర్శకుడు గోపీచంద్‌ మలినేని డీసెంట్‌ సక్సెస్ ను బాలయ్య కు అందించాడు. అందుకే మరోసారి గోపీచంద్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు బాలయ్య గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ప్రస్తుతం గోపీచంద్‌ హిందీలో ఒక భారీ యాక్షన్‌ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బాలయ్య తో సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌ లో వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఇటీవలే బాలకృష్ణ ను కలిసిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని కథ వినిపించడం జరిగిందట. ఆ కథకు బాలయ్య ఓకే చెప్పడం, వెంటనే షైన్ స్క్రీన్‌ బ్యానర్‌ లో సాహు గారపాటి నిర్మించేందుకు సిద్ధం అయ్యాడు. వీరి కాంబోలో మరో హిట్‌ మూవీ రావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పోల్చితే గోపీచంద్‌ మలినేని తో చేయబోతున్న సినిమా మంచి కమర్షియల్‌ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. బాలయ్య తో చేయబోతున్న గోపీచంద్‌ మలినేని సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News