న‌భా ముగ్ధ మ‌నోహ‌ర రూపం

నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొడ‌తోంది. న‌భా తాజాగా చీర- ర‌వికెలో అందంగా ముస్తాబై క‌నిపించింది.

Update: 2024-10-15 16:52 GMT

రామ్ స‌ర‌స‌న 'ఇస్మార్ట్ శంక‌ర్'లో అద్భుత‌మైన న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసింది న‌భా న‌టేష్. ఎన‌ర్జిటిక్ హీరోతో పోటీప‌డుతూ డ‌బుల్ ఎన‌ర్జీ చూపించింది న‌భా. ఈ భామ మాస్ అవ‌తార్, పెర్ఫామెన్స్ కి యూత్ ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో ఆరంగేట్రం నుంచి త‌న‌దైన అందం, డ్యాన్సులు, ప్ర‌తిభ‌తో ఆక‌ర్షిస్తున్న ఈ బ్యూటీకి ఉన్న‌ట్టుండి ఓ ప్ర‌మాదం కంటిమీద కునుకుప‌ట్ట‌నీకుండా చేసింది.

 

2021 చివరి లో నభా రెస్ట్‌రూమ్‌లో జారిపడటంతో ఎడమ భుజానికి తీవ్ర గాయం అయింది. చిన్న ప‌గుళ్ల కార‌ణంగా ఆమెకు శస్త్రచికిత్స చేయవలసి ఉందని వైద్యులు ధృవీక‌రించారు. శస్త్రచికిత్స విజ‌య‌వంత‌మైంది. అనంత‌రం త‌ను కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. అయితే ఈ గ్యాప్ లో న‌భా చాలా అంత‌ర్మ‌థ‌నానికి గురైంద‌ని క‌థ‌నాలొచ్చాయి. త‌న చేతికి అయిన గాయం కార‌ణంగా న‌భా నిజంగా అద్భుత‌మైన అవ‌కాశాల‌ను కోల్పోయింది. దాని గురించి చాలా క‌ల‌త‌కు గురైంది.

 

కానీ నెమ్మ‌దిగా 2024లో పున‌రాగ‌మ‌నంలో కాన్ఫిడెంట్ గా క‌నిపిస్తోంది. ఈ భామ ఇటీవ‌ల‌ పలు పాన్-ఇండియా చిత్రాలకు సంతకం చేసింది. నిఖిల్‌ సిద్ధార్థ స‌ర‌స‌న 'స్వయంభూ' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాపై న‌భా చాలా హోప్స్ పెట్టుకుంది. వారియ‌ర్ స్టోరీతో ఇది పాన్ ఇండియ‌న్ మార్కెట్లో అత్యంత భారీగా విడుద‌ల కానుంది. ఇప్పుడు మ‌రో పెద్ద పాన్ ఇండియ‌న్ ప్రాజెక్టుకు సంత‌కం చేసింది న‌భా. అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ నాగబంధం అనే చిత్రంలో న‌టిస్తోంది. ఇందులో విరాట్ కర్ణ తన సహనటుడు కాగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది. ఈ రెండు ప్రాజెక్టుల‌తో న‌భాకు మంచి కాన్ఫిడెన్స్ వ‌చ్చింది. ఇన్నాళ్లు త‌న‌లో ఉన్న క‌ల‌త కూడా తీరిపోయింద‌ని అంతా భావిస్తున్నారు. ఈ రెండు చిత్రాల‌తో త‌న కంబ్యాక్ అద్భుతంగా ఉంటుంద‌ని న‌భా ఆశిస్తోంది. ఒక‌వేళ ఏదైనా బంప‌ర్ హిట్టు త‌గిలితే మ‌ళ్లీ పూర్తిగా రేసులోకి వ‌చ్చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

 

ఇక కంబ్యాక్ లో న‌భా త‌గ్గేదేలే అంటూ సోష‌ల్ మీడియాల్లో విరుచుకుప‌డుతోంది. నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొడ‌తోంది. న‌భా తాజాగా చీర- ర‌వికెలో అందంగా ముస్తాబై క‌నిపించింది. ఎంపిక చేసుకున్న డిజైన‌ర్ శారీ బ్లౌజ్ కి త‌గ్గ‌ట్టే న‌భా ఆభ‌ర‌ణాల‌ను భారీగా ధ‌రించింది. ముఖ్యంగా ఆ బ్లౌజ్ క‌టింగ్, షేపులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. న‌భా ముగ్ధ మ‌నోహ‌ర రూపం హృద‌యాల‌ను హ‌త్తుకుంటోంది. న‌భా ప్ర‌తిభ విష‌యంలో డౌట్లు ఏవీ లేవు. డ్యాన్సుల్లోను ఇర‌గ‌దీస్తుంది. ఇక ఇదే అందంతో క‌వ్విస్తూ ఉంటే అగ్ర హీరోలు కూడా పిలిచి అవ‌కాశాలిస్తారేమో!!

Tags:    

Similar News