హీరో మెద‌డులో డిస్క్ తిరుగుతోంద‌న్న నిర్మాత‌

ఫ్రైడే టాకీస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పహ్లాజ్ మాట్లాడుతూ- గోవిందా తన అసంపూర్తి హిందీ చిత్రంతో తన మతి కోల్పోయినందున అయోమయంలో పడ్డాడు.. అని కామెంట్ చేసారు.

Update: 2024-07-17 02:45 GMT

జేమ్స్ కామెరూన్ అవతార్‌లో త‌న‌కు ఓ పాత్రను ఆఫర్ చేసార‌ని 'ఆప్ కి అదాలత్‌' టీవీ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ హీరో గోవిందా కొన్నేళ్ల క్రితం చేసిన ప్రకటనకు చాలామంది న‌వ్వుకున్నారు. అత‌డి ప్ర‌క‌ట‌న‌పై విమర్శలు, సెటైర్లు ఎదుర‌య్యాయి. తనకు నిజంగానే కామెరూన్ సైన్స్-ఫిక్షన్ ఫిల్మ్ అవ‌తార్ లో అవ‌కాశం వచ్చిందని గోవిందా బ‌లంగా చెప్పాల‌ని చూసినా కానీ.. ప‌రిశ్ర‌మ సాటి న‌టులు, సినిమా ఔత్సాహికులు దానిని అప‌హాస్యం చేసారు. సోష‌ల్ మీడియాల్లో దీనిపై బోలెడంత మీమ్ ఫెస్ట్ ర‌న్ చేసారు.

ఇండ‌స్ట్రీ ఇన్ సైడ‌ర్లు దీనిపై చాలా కామెంట్లు చేసారు. సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్, సినీ నిర్మాత పహ్లాజ్ నిహలానీ ఇప్పుడు గోవిందా వాదనలను తోసిపుచ్చారు. ఫ్రైడే టాకీస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పహ్లాజ్ మాట్లాడుతూ- గోవిందా తన అసంపూర్తి హిందీ చిత్రంతో తన మతి కోల్పోయినందున అయోమయంలో పడ్డాడు.. అని కామెంట్ చేసారు.

పహ్లాజ్ ఇంకా మాట్లాడుతూ.. ''నేను అతడితో అవతార్ అనే సినిమా తీశాను. నేను 40 నిమిషాలు చిత్రీకరించాను.. ఇది నా ఉత్తమ చిత్రాలలో ఒకటిగా పరిగణిస్తాను. కానీ మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. అదే టైటిల్ (అవ‌తార్) ని మా సినిమాకి టైటిల్ గా పెట్టుకున్న‌ కారణంగా అతడి మనసులో అది అలా బ‌లంగా ముద్రిత‌మై ఉంది. ఏం తప్పు జరిగిందో నాకు తెలియదు.. అతడు హాలీవుడ్ అవతార్ చేస్తున్నానని చెప్పుకుంటూనే ఉన్నాడు. అతడి మెదడులోని డిస్క్ తిరుగుతుంది..అతడు హిందీ నుండి ఇంగ్లీషుకి వెళ్ళాడు..అని సెటైరిక‌ల్ గా స్పందించారు.

గోవిందా తనకు అవతార్ (ఇంగ్లీష్‌) ఆఫర్ ఇచ్చార‌ని చెప్పుకుని తిరిగాడు. కానీ అది హాలీవుడ్ అవ‌తార్ కాదు.. ప్ర‌హ్లాజ్ నిహ‌లానీ అవ‌తార్. ఈ విష‌యం మర్చిపోయాడని ప్ర‌హ్లాజ్ చెప్పారు. అలా జర‌గ‌డం పెను విషాదం. ఇదిలా ఉంటే... మేం ఒకే షెడ్యూల్‌లో సినిమా చేయడానికి ప్రయత్నించాము. కానీ చివరి నిమిషంలో అతడు టీతో ఏ బాదం తింటాడో నాకు తెలియదు.. అతడు మూర్ఛపోవడం ప్రారంభ‌మైంది. మాకు బుర్ర ఖ‌రాబైంది. అతడు అర్ధంలేని మాట‌లు మాట్లాడటం ప్రారంభించాడు. మా షెడ్యూల్ ముందుకు సాగుతూనే ఉంది. కొన్ని పాటలు మిగిలి ఉన్నాయి. క్లైమాక్స్‌లోని కొన్ని భాగాలు చిత్రీక‌రించాలి. కానీ అతడు అస్సలు షూటింగ్ కి రాలేదు. షాట్ సిద్ధంగా ఉంటుంది.. అతను మేల్కొంటాడు.. కానీ మూర్ఛపోతున్నాడు. పటా నహీ బదామ్ మే క్యా థా, సస్పెన్స్ హై ఆజ్ తక్ (బాదంలో ఏముందో నాకు తెలియదు.. అది ఇప్పటికీ సస్పెన్స్).. అంటూ తన‌దైన శైలిలో సెటైర్లు వేసారు నిర్మాత ప్ర‌హ్లాజ్. ప్ర‌హ్లాజ్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం అవ‌తాక్ చిత్రీక‌ర‌ణ‌కు గోవింద ఎంత‌మాత్రం స‌హ‌క‌రించ‌లేద‌నే ఆవేదన అత‌డిలో క‌నిపించింది.

Tags:    

Similar News