సోగ్గాడికి ఆయనంటే అంత అభిమానమా?
అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ద్వారా వాళ్లు వెలుగులోకి రావడం తప్ప! అంతకు మించి సొగ్గాడు అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయలేదు.
లెజెండరీ నటుడు, ఆంధ్రా అందగాడు, సొగ్గాడు శోభన్ బాబు గురించి చెప్పేదేముంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకి సొగ్గాడు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన వారసత్వాన్ని ఇండస్ట్రీలో ఎవరూ కొనసాగించలేదు కానీ, కొనసాగిస్తే గనుక ఆ లెక్క వేరేలా ఉండేది. వారసులున్నా వాళ్లెవ్వరూ సినిమా రంగం వైపు రాలేదు. ఇతర దేశాల్లో వేర్వేరు వృత్తుల్లో స్థిరపడటంలో శోభన్ బాబు వారసత్వం ఇండస్ట్రీలో లేకుండా పోయింది. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ద్వారా వాళ్లు వెలుగులోకి రావడం తప్ప! అంతకు మించి సొగ్గాడు అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేయలేదు.
ఇక శోభన్ బాబు ఎంత గొప్ప నటుడో? అంతకు మించి గొప్ప క్రమశిక్షణ గలిగిన నటుడిగా చెబుతారు. జీవితం పట్ల ఎలా ఉండాలి? జీవితాన్ని సక్సెస్ దిశగా ఎలా మలుచుకోవాలి? అని అప్పట్లోనే తోటీ నటీనటులకు తన సక్సెస్ స్టోరీ చెప్పి ఇన్ స్పైర్ చేసేవారు. విధిగా ఆయన సూచనలు, సలహాలు పాటించి పైకొచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి శోభన్ బాబు గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు. అది ఆయన గొప్పతనం.
తాజాగా శోభన్ బాబు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? ఇండస్ట్రీలో ఆయన క్లోజ్ ప్రెండ్ ఎవరు? అన్న విషయాన్ని గుమ్మడి కుమార్తె శారద ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అదేంటో ఆమె మాటల్లోనే..
`శోభన్ బాబుగారికి మా నాన్నగారు అంటే చాలా అభిమానం. ఓ ఏడాది నాన్నగారి పుట్టినరోజు వేడుకను మద్రాసులో చేశాము. ఆ రోజంతా ఆయన మా నాన్నగారితోనే ఉన్నారు. సాధారణంగా శోభన్ బాబుగారు ఏ ఫంక్షన్ కి రారు. ఎవరింటికి వెళ్లరు.
అలాంటి ఆయన ఒక రోజంతా నాన్నగారితోనే ఉన్నారంటే, ఆయనకి ఎంతటి అభిమానమో అర్థం చేసుకోవచ్చు. మా చిన్న చెల్లెలు పెళ్లికి ఆయన అవుట్ డోర్ షూటింగులో ఉన్నారు. అందువలన ఆయన శ్రీమతి ఆ ఫంక్షన్ కి వచ్చారు. సాధారణంగా ఆమె కూడా ఎక్కడికీ వెళ్లరు. నాన్నగారి పట్ల గౌరవంతో ఆమెను పంపించారు. ఇక రాజబాబుగారికి కూడా నాన్న అంటే ఎంతో అభిమానం. ఆయన నాన్న ముందు కూర్చునేవారు కాదు` అని అన్నారు.