గుంటూరు కారం బాక్సాఫీస్ టార్గెట్.. ఎంత దగ్గర్లో ఉందంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చింది. ఆరంభంలో మిక్సడ్ టాక్ వచ్చినా అనంతరం సూపర్ స్టార్ వన్ మెన్ షో తో మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వచ్చిన మూడో సినిమా ఇది కావడం విశేషం.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే వంద కోట్లకి పైగా షేర్ ని వసూళ్లు చేసేసింది. ఇదిలా త్రివిక్రమ్, మహేష్ కలయికలో ఫస్ట్ హిట్ మూవీగా ఈ సినిమా మారబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బిగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. హాలిడే సీజన్ లో కూడా గుంటూరు కారం సాలీడ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి సినిమాకు మంచి సపోర్ట్ లభించింది.
ఇక ఈ సినిమా 12 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 97 శాతం రికవరీ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సాలీడ్ బిజినెస్ చేసిన గుంటూరు కారం దాదాపు అన్ని ఏరియాల్లో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకు వస్తోంది. ఇక త్వరలోనే సినిమా ప్రాఫిట్ జోన్ లోకి రానుంది. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ తో పాటు మదర్ సెంటిమెంట్ కూడా బాగా హైలెట్ అయ్యింది.
ముఖ్యంగా రమ్యకృష్ణ, మహేష్ కాంబినేషన్లో వచ్చిన సీన్స్ కొన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కి మూవీ కనెక్ట్ కావడంతో ఫెస్టివల్ సీజన్ లో మేగ్జిమమ్ థియేటర్స్ హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా మేగ్జిమమ్ కలెక్షన్స్ వచ్చేసాయి. ఇంకా మూవీ థియేటర్స్ లో కొనసాగుతోన్న నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ కూడా అందుకొని క్లీన్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు ఖాతాలో మేగ్జిమమ్ అన్ని హిట్ మూవీస్ పడ్డాయి. ఇప్పుడు గుంటూరు కారంతో మరో సూపర్ హిట్ చేసింది. మహేష్ బాబుకు క్లాస్ అండ్ మాస్ ఏరియాల్లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ మరోసారి గుంటూరు కారం ద్వారా అర్ధమవుతోంది. ఇక ఈ మూవీలో మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల నటించింది. ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి అదనపు అస్సెట్ అయ్యింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. సినిమాలో మహేష్ బాబు వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా కనిపించబోతున్నారు. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని లుక్, బాడీ లాంగ్వేజ్ మార్చే పనిలో ఉన్నారు.