గుంటూరు కారం.. కొత్త కెమెరాతో మొదలైంది కానీ..

తాజాగా ఈ సినిమా సినిమాటోగ్రాఫర్​గా మనోజ్ పరమహంస బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్​లో ఈరోజు షూటింగ్​ చేశారట.

Update: 2023-08-17 09:51 GMT

హమ్మయ్య.. ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేశ్​ బాబు ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్ అందింది. గుంటూరు కారం సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిసింది. ఈ రోజు షూటింగ్ ప్రారంభించారని సమాచారం అందింది. అలాగే ఇప్పటివరకు ప్రశ్నగా మిగిలిపోయిన సినిమాటోగ్రాఫర్​ ఎవరనే సిందిగ్ధత కూడా వీడింది.

చాలా కాలంగా గుంటూరు కారం సినిమాకు సినిమాటోగ్రాఫర్​గా ఉంటున్న పీఎస్​ వినోద్​ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్​కు కాస్త బ్రేక్ పడటం, మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫారెన్ టూర్ వెళ్లడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. దీంతో కొత్త సినిమాటోగ్రాఫర్ ఎవరు? షూటింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగింది.

తాజాగా ఈ సినిమా సినిమాటోగ్రాఫర్​గా మనోజ్ పరమహంస బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్​లో ఈరోజు షూటింగ్​ చేశారట. ఆయన విజువల్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్​ టాలెంట్​ గురించి తెలిసిందే. ఏమాయ చేశావే, రేసుగుర్రం, రాధేశ్యామ్​, బీస్ట్​ సహా పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్​గా వర్క్ చేశారు. ప్రస్తుతం దళపతి విజయ్​ లియోకు పని చేస్తున్నారు.

అలా ఇప్పుడు గుంటూరు కారంకు కూడా వర్క్​ చేయడం ప్రారంభించేశారు. ఇక దీంతో అభిమానులకు ఓ టెన్షన్ తీరిపోయింది. అయితే అసలు సవాల్ ఇప్పుడే మొదలైంది. మొదటి నుంచి ఈ సినిమాను వచ్చే ఏడాదికి సంక్రాంతికి విడుదల చేస్తామని మూవీటీమ్ చెబుతూనే ఉంది. అంటే ఈ లెక్కన మరో నాలుగు నెలల్లో షూటింగ్​ను పూర్తి చేసి ఫస్ట్ కాపీని రెడీ చేసుకోవాలి.

అంటే అనుకున్న సమయంలో చిత్రీకరణ పూర్తి చేసే బాధ్యత దర్శకుడు త్రివిక్రమ్​పైనే ఉంది. మరి త్రివిక్రమ్​ అంతకుముందులా ఇతర సినిమాలు పనేమి పెట్టుకోకుండా ఫోకస్​ అంతా గుంటూరు కారంపైన పెడితేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే ఫ్యాన్స్​ ఆగ్రహానికి గురౌవాల్సి వస్తుంది. కాబట్టి గురూజీ ప్లాన్డ్​గా వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. చూడాలి మరి ఈ మాటల మాంత్రికుడు ఏం చేస్తారో..

ఇకపోతే ఈ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేశ్ 20వ తేదీ నుంచి షూటింగ్ సెట్​లో అడుగుపెడతారని మొన్నటి వరకు ప్రచారం సాగింది. తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి.

Tags:    

Similar News