గుంటూరు కారం.. గురూజీకి అసలైన సవాల్
సినిమాటోగ్రాఫర్‌గా ఉంటున్న పీఎస్ వినోద్ తప్పుకున్నా.. మనోజ్ పరమహంస ఆ బాధ్యతలు తీసుకుని హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ షురూ చేశారు
సినిమా పూర్తవుతుందా లేదా అన్న అనుమానంతో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. సినిమాటోగ్రాఫర్‌గా ఉంటున్న పీఎస్ వినోద్ తప్పుకున్నా.. మనోజ్ పరమహంస ఆ బాధ్యతలు తీసుకుని హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ షురూ చేశారు. దీంతో అభిమానులకు ఓ టెన్షన్ తీరిపోయింది.
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. మూవీటీమ్ కు గట్టి సవాల్ ఎదురైంది. ఎందుకంటే ఈ సినిమాను మొదటి నుంచి వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతూ వస్తోంది. కానీ అందుకు తగ్గట్టు ప్లాన్డ్ గా ఇప్పటివరకు షూటింగ్ జరపలేదు. అన్నీ సమస్యలనే ఎదుర్కొంది. సరే ఎలాగో ఇప్పుడు మొదలైంది అనుకుంటే.. సినిమా విడుదలకు గట్టిగా నాలుగున్నార నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది.
అంటే ఈ లెక్కన ఈ నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఫస్ట్ కాపీని రెడీ చేసుకోవాలి. మరి ఇదంతా అవుతుందా అనేది ప్రస్తుతం అనుమానంగా మారింది. మరి ఇంత తక్కువ సమయంలో చిత్రీకరణ పూర్తి చేసే బాధ్యత దర్శకుడు త్రివిక్రమ్, కొత్త సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసపైనే ఉంది. అంటే వీరిద్దరికి అసలు సవాల్ ఇప్పుడే మొదలైంది అని చెప్పాలి. కాబట్టి ఈ ఇద్దరు తమ పనులను వేగవంతం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరముంది.
ముఖ్యంగా గురూజీ.. అంతకుముందులా ఇతర సినిమాలు పనేమి పెట్టుకోకుండా ఫోకస్ అంతా ఈ గుంటూరు కారంపైన పెడితేనే ఇది సాధ్యమవుతుంది. లేదంటే ఇప్పటికే ఫుల్ గుస్సాగా ఉన్న మహేశ్ అభిమానులు త్రివిక్రమ్ ను ఓ ఆటాడేసుకుంటారు. అదే సమయంలో కథ కూడా మంచిగా ఉండాలి. లేదంటేనా ఇక త్రివిక్రమ్ పని అయిపోయినట్టే. చూడాలి మరి ఈ మాటల మాంత్రికుడు ఏం చేస్తారో.
ఇక ఈ గుంటూరు కారం సినిమా కాస్ట్ విషయానికొస్తే.. చిత్రంలో యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల, హిట్ ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ బాగా ఆకట్టుకున్నాయి. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మూవీలో మహేశ్ మున్నపెన్నడూ కనిపించని సరికొత్త మాస్ లుక్ లో కనిపించబోతున్నారని మూవీటీమ్ చెబుతోంది.