'గుంటూరు కారం'.. ఆ సీక్వెన్స్ మామూలుగా ఉండవట

తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయిటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా సెకండాఫ్ లో ... మహేష్ బాబు, శ్రీలీల కలిసి గుంటూరు మిర్చి గిడ్డంగి లో.. చేసే రచ్చ మామూలుగా ఉండదట.

Update: 2024-01-04 04:01 GMT

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై విపరీతమైన హైప్ పెంచేశారు మేకర్స్. ముఖ్యంగా ఇటీవల రిలీజైన 'కుర్చీ మడతపెట్టి' మాస్ సాంగ్ సినిమాపై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్లింది.

ఈ పాటలో మహేష్, శ్రీలీలా ఊర మాస్ స్టెప్పులకు అందరూ ఫిదా అయిపోయారు. గతంలో ఎన్నడు లేనంతగా మహేష్ ఈ సినిమాలో మాస్ డాన్స్ తో అదరగొట్టేసారు. దీంతో ఈసారి థియేటర్స్ లో సంక్రాంతి సందడి మొత్తం 'గుంటూరు కారం' తోనే ఉండబోతుందని అర్థం అయిపోయింది. మరోవైపు రిలీజ్ కి ముందే సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ లీక్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయిటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా సెకండాఫ్ లో ... మహేష్ బాబు, శ్రీలీల కలిసి గుంటూరు మిర్చి గిడ్డంగి లో.. చేసే రచ్చ మామూలుగా ఉండదట. అక్కడ వీళ్లిద్దరూ కలిసి 'ఒక్కడు' సినిమాలోని చెప్పవే చిరుగాలి పాటతో 'నెక్కిలీసు గొలుసు' సాంగ్ కి చేసే రచ్చ మాములుగా ఉండదట. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయిన 'నాది నెక్కిలేసు గొలుసు' సాంగ్ కి మహేష్, శ్రీలీలా కలిసి మాస్ స్టెప్పులు వేస్తే థియేటర్స్ అంతా దద్దరిల్లిపోవాల్సిందే.

ప్రస్తుతం ఈ అప్డేట్ తో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామని ఆత్రుతగా ఉన్నారు. అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ఇది. ఇందులో మహేష్ పక్కా ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సీనియర్ హీరో జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ, ఈశ్వరీ రావు, రఘుబాబు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 12 న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ని ఈ నెల 8 న రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News