ట్విస్ట్ ఇచ్చిన మరో కోలీవుడ్ జంట.. విడిపోయాం అంటూ..

తాజాగా అధికారికంగా ఇద్దరూ కూడా విడిపోతున్నట్లు ధృవీకరించారు. మీడియాకి ఒక లెటర్ రిలీజ్ చేసి విడాకులు తీసుకున్నట్లు కన్ఫర్మ్ చేశారు.

Update: 2024-05-14 03:40 GMT
ట్విస్ట్ ఇచ్చిన మరో కోలీవుడ్ జంట.. విడిపోయాం అంటూ..
  • whatsapp icon

చిత్ర పరిశ్రమలో ఉండే సెలబ్రెటీలపై ఎప్పుడు కూడా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వారి వ్యక్తిగత జీవితాలలో జరిగే సంఘటనలపై సోషల్ మీడియాలో ఏదో ఒక గాసిప్ వైరల్ అవుతూనే ఉంటుంది. సెలబ్రెటీల విషయంలో గాసిప్స్ గా ప్రారంభమైన కొన్ని కథనాలు తరువాత నిజం అవుతాయి. అలాంటి సంఘటనలు చాలా సార్లు జరిగాయి. నిప్పులేనిదే పొగరాదు అనే సామెతకి తగ్గట్లుగానే సెలబ్రెటీలపై వాచ్ ఉంటుంది.

 

రీసెంట్ గా ఒక కోలీవుడ్ జంట విడాకులు తీసుకున్నట్లు రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఆ జంట సోమవారం రాత్రి సోషల్ మీడియాలో అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. వారి వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి జీవీ ప్రకాష్ కుమార్.

ఓ వైఫు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటూనే హీరోగా కూడా జీవీ సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నాడు. చివరిగా డియర్ అనే మూవీతో హీరోగా జీవీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక జీవీ ప్రకాష్ కుమార్, గాయని సైంధవి 11 ఏళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే గత కొంతకాలంలో జీవీ, సైంధవి మనస్పర్థల కారణంగా దూరంగా ఉంటున్నారని, విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం నడుస్తోంది.

అయితే దీనిని వారు ఖండించే ప్రయత్నం చేయలేదు. తాజాగా అధికారికంగా ఇద్దరూ కూడా విడిపోతున్నట్లు ధృవీకరించారు. మీడియాకి ఒక లెటర్ రిలీజ్ చేసి విడాకులు తీసుకున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఎంతగానో ఆలోచించి మా 11 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మాన‌సిక ప్ర‌శాంత‌త‌తో పాటు ఇద్ద‌రి జీవితాల్లో మెరుగుపరుచుకోవడం కోసం ప‌ర‌స్ప‌ర అంగీకారంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నాం.

మీడియా మిత్రులు, శ్రేయభిలాషులు మా నిర్ణయాన్ని గౌరవించి, ప్రైవసీకి భంగం కలిగించకుండా రెస్పెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మేము తీసుకున్న ఈ నిర్ణయం మా ఇద్దరికీ మేలు చేస్తుందని నమ్ముతున్నాం. ఈ కఠినమైన సమయంలో మమ్మల్ని, మా నిర్ణయాన్ని అర్ధం చేసుకొని మద్దతుగా నిలుస్తారని కోరుకుంటున్నాం అని లెటర్ లో ఇద్దరు పేర్కొన్నారు.

ఈ ఇద్దరు ఒకే లెటర్ ని రిలీజ్ చేసి తమ విడాకుల వార్తని కన్ఫర్మ్ చేశారు. అయితే ఏ కారణాల వలన ఇద్దరూ డివోర్స్ తీసుకుంటున్నారు అనేది క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం జీవీ, సైంధవి విడాకులపై కోలీవుడ్ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇక జీవి ప్రకాష్ కుమార్ ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మేనల్లుడు అని అందరికి తెలిసిన విషయమే. మామయ్య దగ్గరే చాలా కాలం పాటు శిష్యరికం చేసిన అతను మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. ఇక పర్సనల్ లైఫ్ లో ఎప్పుడు కూడా వివాదాలకు తావివ్వని అతను హఠాత్తుగా విడాకుల వార్తతో అందరికి షాక్ ఇచ్చాడు.

Tags:    

Similar News