రామాయ‌ణం కోసం గ్లాడియేట‌ర్ ని దించుతున్నారా?

ఇంకా రామాయ‌ణంలో ఉన్న పాత్ర‌ల‌కు చాలా మంది ప్ర‌ముఖ‌ల పేర్లు వెలుగులోకి వ‌స్తున్నాయి.

Update: 2024-04-05 12:31 GMT

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయ‌ణం ఆధారంగా 'రామాయ‌ణ్' ని భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. శ్రీరాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్.. సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి...రావ‌ణుడి పాత్ర‌లో య‌శ్..హ‌నుమంతుడి పాత్ర‌లో దేవ‌ద‌త్ .. కుంభ‌క‌ర్ణుడి పాత్ర‌లో బాబి డియోల్ పోషిస్తున్నారు. వీళ్ల ఎంపిక‌తోనే రామాయ‌ణం స‌గం స‌క్సెస్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. అంతా గ్రేట్ పెర్పార్మెర్లు కావ‌డంతోనే ఈ బ‌జ్ కి నాంది పండింది. ఇంకా రామాయ‌ణంలో ఉన్న పాత్ర‌ల‌కు చాలా మంది ప్ర‌ముఖ‌ల పేర్లు వెలుగులోకి వ‌స్తున్నాయి.

ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లైంది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. మ‌రీ ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అంటే తివారీ ఏకంగా లెజెండ్స్ నే రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. మ్యూజిక్ లెజెండ్- ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ‌మాన్- హాలీవుడ్ దిగ్గ‌జం హన్స్ జిమ్మర్ ని రంగంలోకి దించుతున్నారు. ఇద్ద‌రు సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించ‌బోతున్నారు. రెహ‌మాన్ ఇటీవ‌లే రిలీజ్ అయిన ది గోట్ లైఫ్ తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. మ‌రోసారి రెహ‌మాన్ మ్యాజిక్ ఆ సినిమా పాట‌ల్లో క‌నిపించింది.

ఇదే వేళ రామాయ‌ణం బాధ్య‌త‌లు ఆయ‌న‌కు అప్ప‌జెప్ప‌డం గొప్ప విశేషం. ఇక హ‌న్స్ జిమ్మ‌ర్ డూన్ హాలీవుడ్ లో ఎన్నో గొప్ప చిత్రాల‌కు సంగీతం అందించారు. డార్క్ నైట్ .. గ్లాడియేటర్.. ఇన్‌సెప్షన్ .. ది లయన్ కింగ్ వంటి చిత్రాలకు సంగీత స్వరకర్తగా పనిచేశారు. తాజాగా రామాయ‌ణం సినిమాతో భార‌తీయ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రామాయ‌ణం క‌థ‌లో సంగీతానికి అత్యంత ప్రాధాన్య‌త ఉంది. క‌థ‌ని ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ చేస్తూనే యుద్ద స‌న్నివేశాలు అంతే హైలైట్ కానున్నాయి.

అలాంటి క‌థ‌కు ప‌నిచేయాలంటే రెహ‌మాన్ - జిమ్ లాంటి మేథ‌స్సు ఉన్న వారి అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని భావించి ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సంగీతం అనేది నేచుర్ నుంచి పుట్టాల‌న్న‌ది రెహ‌మాన్ థీమ్. రామాయాణం కోసం మ‌రోసారి రెహ‌మాన్ శ్ర‌మించాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. ఈసినిమా భార‌తీయ సినిమా రికార్డుల‌న్నింటిని తిర‌గ రాస్తుంద‌ని అంచ‌నాలున్నాయి.

Tags:    

Similar News