జై హనుమాన్.. కాంతార కంటే ముందు ఆ హీరో వద్దకు

కానీ ఇప్పటివరకు సినిమా ఒక ట్రాక్ లోకి రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-10-18 07:38 GMT

టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను ఎప్పుడో స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. అతను అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఈపాటికి సినిమా షూటింగ్ చివరి దశలో ఉండాలి. హనుమాన్ సక్సెస్ కాగానే సీక్వెల్ ను 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామాని ధీమాగా కనిపించాడు. కానీ ఇప్పటివరకు సినిమా ఒక ట్రాక్ లోకి రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.


ముఖ్యంగా నటీనటుల విషయంలో అనేక రకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి దాదాపు హీరో ఫైనల్ అయ్యాడు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే అఫీషియల్ గా ఏ హీరో కూడా ఇప్పటివరకు ఈ సినిమాకు ఫైనల్ కాలేదు. ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే కాంతార కథానాయకుడు రిషబ్ శెట్టి జై హనుమాన్ లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దర్శకుడు ప్రశాంత్ ఇంతకుముందు ఈ కథను టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని హీరోలకు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా సక్సెస్ అయినప్పటికీ ఈ దర్శకుడికి ఎవరు అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు.

ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ హీరో యశ్ ని కూడా సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎందుకనో అతను కూడా ఈ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకోలేదట. ఇక అంతకు ముందు రానా దగ్గుపాటి పేరు కూడా వినిపించింది. మెగా హీరోలలో కూడా కొంతమంది పేర్లు చర్చల్లోకి వచ్చాయి. తమిళ ఇండస్ట్రీలో కూడా సూర్య అలాగే మరో ఇద్దరు హీరోలకు ప్రశాంత్ వర్మ ఈ కథను చెప్పడానికే ట్రై చేశాడు.

కానీ ఏ ప్లాన్ కూడా అనుకున్నట్లు ఫైనల్ కాలేదు. ఇప్పటివరకు కొంతమంది ప్రముఖ హీరోలు ఈ సినిమా కథ బాగుందని చెప్పినప్పటికీ తమకు సెట్ అవ్వదని మరికొందరు చెప్పారట. ఏదేమైనా దర్శకుడు ప్రశాంత్ వర్మ అనుకున్నట్లుగా మాత్రం జై హనుమాన్ క్యాస్టింగ్ పనులు మాత్రం ఈజీగా సాగడం లేదు. హనుమాన్ సినిమాతో 300 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్నప్పటికీ కూడా అతను ఇంకా బ్రతిమాలుకోవాల్సి వస్తోంది. ఇక ఫైనల్ గా రిషబ్ శెట్టి అయితే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News