3Dలో హనుమాన్.. రిలీజ్ ఎప్పుడంటే?
అయితే ఈ సినిమా 3D వెర్షన్‌ను ఇప్పట్లో రిలీజ్ చేయబోరని తెలిసింది. 3D వెర్షన్‌కు సాంకేతికంగా కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది.
హనుమాన్.. సంక్రాంతి రేసులో విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తున్న సినిమా. తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే ఆ సినిమా చూస్తున్నప్పుడు ఇది 3డీలో వస్తే భలే ఉంటుందని చాలా మంది అనుకునే ఉంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రశాంత్ వర్మ టీమ్ సీరియస్ గా తీసుకుందట.
హనుమాన్ మూవీని 3D వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పనులు కూడా మొదలపెట్టేశారట. హైదరాబాద్ లోని ఓ ఫేమస్ మల్టీప్లెక్స్ లో శాంపిల్ ను కూడా చూశారట. ఫుల్ సినిమాను ఇప్పుడు 3D కన్వర్షన్ చేస్తున్నారట. జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. వసూళ్లు భారీగానే రాబడుతోంది.
అయితే ఈ సినిమా 3D వెర్షన్‌ను ఇప్పట్లో రిలీజ్ చేయబోరని తెలిసింది. 3D వెర్షన్‌కు సాంకేతికంగా కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన స్క్రీన్స్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగేసరికి చాలా టైం పట్టవచ్చని తెలుస్తోంది. దీంతో అన్ని పనులు పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
హనుమాన్ ను వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆదరిస్తున్నారు. పిల్లలు అయితే హనుమాన్ ను ఒక సూపర్ హీరోగా భావిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా పిల్లలకు తెగ నచ్చేస్తోంది. దీంతో ఇప్పుడు సమ్మర్ లో 3డీ వెర్షన్ ను తీసుకొస్తే పిల్లలను బాగా ఆకట్టుకోవచ్చు. ఆ టైంలో సెలవులు ఉంటాయి కాబట్టి మళ్లీ భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మెస్మరైజ్ అయిపోతున్నారు. సినిమాలోని చాలా సీన్లు ఆకట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లాంగ్ షాట్ లో వచ్చే భారీ ఆంజనేయస్వామి విగ్రహం అయితే వేరేలెవెల్ అని అంటున్నారు. ఇక ఈ సినిమాను 3D గ్లాసులు పెట్టుకుని, 3D వెర్షన్‌లో చూస్తే హనుమంతుడే పక్కన వచ్చి కూర్చున్నాడా? అనేలా ఉంటుందేమా అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.
అయితే గతంలో ఆర్ఆర్ఆర్ 3D వెర్షన్ కు వచ్చిన స్పందన కాస్త తక్కువే అని చెప్పవచ్చు. దీంతో హనుమాన్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట మేకర్స్. అందుకు తగ్గ ప్రమోషన్లు కూడా చేయాలని ఫిక్స్ అయ్యారట. రెస్పాన్స్ బట్టి థియేటర్ల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారట. యూఎస్ లో కూడా 3డీ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారట. మొత్తానికి హనుమాన్ 3D వెర్షన్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.