ఆ హీరోయిన్ ని ఎర్రగా చూసి ఇబ్బంది పెట్టాడా?
ఇక హీరోయిన్లు గుమ్మిగూడిన ప్రదేశాల్లోకి వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలిసిందే.
హీరోయిన్లపై లైంగిక వేధింపుల అంశం గురించి ఎప్పటికప్పుడు మీడియాలో తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా బాధితులంతా తమకు జరిగిన అన్యాయంపై పబ్లిక్ కెమెరా ముందుకొచ్చి చెప్పారు. స్టార్ హీరోయిన్లు ఎంతో మంది ఈ జాబితాలో ఉన్నారు.
కాస్టింగ్ కౌచింగ్ లో భాగంగా నటీమణులు పరిశ్రమలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నది? చాలా ఓపెన్ అయిన అంశం. ఇక హీరోయిన్లు గుమ్మిగూడిన ప్రదేశాల్లోకి వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా తెలిసిందే.
ఆకతాయిల అసభ్య ప్రవర్తనతో ఇబ్బంది పడిన వారు ఎంతో మంది ఉన్నారు. సరైన సెక్యురిటీ ఏర్పాట్లు కుదరని పక్షంలో నటీమణులు అసౌకర్యానికి గురవుతుంటారు. అయితే ఈ హీరోయిన్ కథ మాత్రం అందకు కాస్త భిన్నంగా ఉంటుంది. బెంగుళూరు నుంచి టాలీవుడ్ కి దిగుమతి అయిన ఈ బ్యూటీ తెలుగులో చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. మ్యూజిక్ ప్రోగ్రామ్ లు ఎక్కువగా హోస్ట్ చేసింది.
అందుకు స్నేహితులు సహకారం అందిస్తున్నారు. అయితే ఈ బ్యూటీ గతంలో ఓ ఆకతాయి కారణంగా లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఓ సినిమా ప్రారంభోత్సవం సమయంలో పూజా కార్యక్రమా లు అనంతరం మీడియా సమావేశానికి హాజరయ్యారుట.
అదే సమయంలో ఓ ఆకతాయి అప్పటికే ఆ హీరోయిన్ ని వింత చేష్టలతో వేధిస్తున్నాడుట. తొలుత పెద్దగా పట్టించుకోనప్పటికీ ఓ వైపు మీడియా మీట్ లో ఉన్నా సరే అతగాడు ఆమెవైపే ఎర్రగా చూసినట్లు చెప్పుకొచ్చింది.
ఆ సమయంలో తాను సారీ లో ఉన్నానని.. అందులోనూ అది పలుచని సారీ కావడంతో చాలా అసౌకర్యా నికి గురైనట్లు తెలిపింది. సమాజంలో ఇలాంటి పురుషుల్ని చూసినప్పుడు ఆసహ్యం కలుగుతుందని అసహనాన్ని వ్యక్తం చేసింది. గతంలో ఓసారి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపు కంటే ఇది మరింతగా ఇబ్బంది పెట్టిన అంశమని గుర్తు చేసుకుంది.