'మాట వినాలి' అదెలాగో వీర‌మ‌ల్లు ఇలా చెప్తిరి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న `హరి హర వీరమల్లు` పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అప్ డేట్స్ కోసం ప్యాన్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2025-01-17 06:12 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న `హరి హర వీరమల్లు` పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అప్ డేట్స్ కోసం ప్యాన్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారో చెప్పాల్సిన ప‌నిలేదు. షూటింగ్ ముగింపులో ఉన్న నేప‌థ్యంలో ప్ర‌చారం ప‌నులు ఎప్పుడు మొద‌ల‌వుతాయా? అని అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో లిరిక‌ల్ సింగిల్స్ ఎప్పుడంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటి జ‌నులు అడుగుతూనే ఉన్నారు.


తాజాగా ఆ స‌మ‌యం రానే వ‌చ్చేసింది. నేడు తొలి లిరిక‌ల్ సింగిల్ ని రిలీజ్ చేసి అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ చేసారు. `మాట వినాలి` అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ ఎంట్రీ ఇచ్చారు. ఈ పాట‌ను ఆయ‌నే స్వ‌యంగా అల‌పిం చ‌డం విశేషం. సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే `మాట వినాలి` లిరికల్ వీడియోతో వీర‌మ‌ల్లు పాట‌ల ప్ర‌చారం మొద‌లైంది. `వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి` అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్ ఈ పాట పాడారు. అందరూ పాడుకునేలా అర్థవంతమైన పంక్తులు, శక్తివంతమైన జానపద బీట్‌ లతో `మాట వినాలి` గీతం మనోహరంగా ఉంది. ఈ పాట‌కు పెంచల్ దాస్ అందించిన సాహిత్యం అందించారు.

పాట‌లో ఎంతో లోతైన భావాన ఉంది. మంచి మాటలను వినడం వాటి నుండి వచ్చే జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ఈ పాట తెలియ‌జేస్తుంది. పాట‌లో చ‌క్క‌ని సందేశం ఉంది. ప్రతి వాక్యం విలువైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది. జీవితంలో సానుకూలత , ధర్మాన్ని స్వీకరించడానికి శ్రోతలను ప్రోత్సహిస్తుంది. అటవీ నేపథ్యంలో నైట్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీక‌రించిన పాట ఇది. అడవిలో మంట చుట్టూ వీరమల్లు అనుచరుల బృందం గుమిగూడినట్లుగా లిరికల్ వీడియోలో చూపించారు. పవన్ కళ్యాణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ ఆక‌ట్టుకుంటుంది. కీర‌వాణి సంగీతం ఆక‌ట్టుకుంటుంది.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి గీతాన్ని తెలుగులో `మాట వినాలి`, తమి ళంలో `కెక్కనుం గురువే`, మలయాళంలో `కేల్‌క్కనం గురువే`, కన్నడలో `మాతు కేలయ్యా` , హిందీలో `బాత్ నీరాలి` గా విడుదల చేశారు. తెలుగులో పెంచల్ దాస్, తమిళంలో పి.ఎ. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉంది. నిర్మాణానంతర ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News