వీరమల్లు పై సీరియస్ డిస్కషన్ ఇలా!
అందులో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, నిర్మాత ఏ.ఎం రత్నం , దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి , విఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్‌లు ఉన్నారు.
జూన్ 4 తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రీ అయిపోతాడు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ల్ని పూర్తి చేయడమే పనిగా పెట్టుకుంటాడు. ఇప్పటికే 'ఓజీ' టీమ్ రెడీ అవుతుంది. సెప్టెంబర్ లో రిలీజ్ తేది ప్రకటించిన నేపథ్యంలో పీకే ఈ సినిమాని ముందుగా పూర్తి చేస్తాడు. దీంతో పాటు కుదిరితే 'హరి హర వీరమల్లు' షూటింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీరమల్లు టీమ్ కూడా రెడీ అవుతుంది. తాజాగా ఆ సినిమా యూనిట్ సభ్యులు సమావేశమైన ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.
అందులో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, నిర్మాత ఏ.ఎం రత్నం , దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి , విఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్‌లు ఉన్నారు. వీరంతా వీరమల్లు గురించే సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. పెండింగ్ షూటింగ్ ఎలా ప్లాన్ చేయాలి? పూర్తి చేయాల్సిన ప్రణాళిక ఏంటి? వంటి అంశాలపై డిస్కషన్ సాగినట్లు తెలుస్తోంది. అలాగే తదుపరి షూట్ కి సంబంధించి లోకేషన్ల గురించి చర్చ జరిగినట్లు వినిపిస్తుంది.
షూటింగ్ పూర్తయిన వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నారు. పీరియాడిక్ చిత్రం కాబట్టి ఇలాంటి పనులు డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే క్రిష్ పూర్తి చేసిన పార్ట్ వరకూ ఎలాంటి పెండింగ్ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఏడాది చివరకల్లా సినిమా రిలీజ్ చేస్తామని రత్నం ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత వేగంగానే ఆ పనులు పూర్తిచేసే అవకాశం ఉంది.
దాంతో పాటు పెండింగ్ షూట్ కూడా అంతే వేగంగా పూర్తి చేయనున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం రిలీజ్ అనంతరం రెండవ భాగంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఓ టీమ్ లొకేషన్ల వేటలో ఉందని సమాచారం.