హరీష్ శంకర్ ఎటు తేల్చుకోలేకపోతున్నాడా..?
అయితే రవితేజతో సినిమా మొదలు పెట్టాక పవన్ వీలు ఉన్నప్పుడల్లా షూటింగ్ చేద్దామని అనుకుంటే చేయడం కుదరదు.
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్స్ లో ఒకరైన హరీష్ శంకర్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే పక్కా ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో ఒక మార్క్ సెట్ చేస్తారన్న టాక్ ఉంది. ఇక మెగా హీరోలతో హరీష్ శంకర్ సినిమా అంటే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. ఇప్పటికే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్ లతో సినిమాలు చేసిన హరీష్ శంకర్ మరోసారి పవన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమాతో ఈ కాంబో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హిందీలో సూపర్ హిట్టైన దబాంగ్ ని తెలుగులో రీమేక్ చేశారు.
గబ్బర్ సింగ్ రికార్డులు ఏంటన్నది మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బాగా తెలుసు. ఆ కాంబోని రిపీట్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ ప్లాన్ చేశారు హరీష్ శంకర్. అయితే ఆ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఎంతకీ ముందుకు కదలట్లేదు. ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో అనౌన్స్ చేసిన ఆ సినిమా ఈమధ్యనే ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. ఈ ఇయర్ సమ్మర్ లో నెల రోజుల పాటు ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సినిమాకు కొంత భాగం పనిచేశారు.
చేసిన నెల రోజుల షూటింగ్ లోనే మంచి టీజర్ కట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేలా చేశారు హరీష్ శంకర్. ఆ తర్వాత పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే రెండేళ్లుగా వెయిటింగ్ లో ఉన్న హరీష్ శంకర్ పవన్ కోసం మరో ఆరు నెలలు వెయిట్ చేయక తప్పదని తెలుస్తుంది. అంతేకాదు ఏపీలో ఎలక్షన్స్ ముందుగా వస్తే మాత్రం ఇంకో ఆరు నెలలు అంటే మరో ఏడాది పాటు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వెయిట్ చేయక తప్పదు. అందుకే ఈలోగా ఉస్తాద్ ని పక్కన పెట్టి మరో సినిమా చేయాలని అనుకున్నారు హరీష్ శంకర్.
తన మిరపకాయ్ హీరో రవితేజతో సినిమా ఒకటి ప్లానింగ్ లో ఉందని టాక్. అయితే రవితేజతో సినిమా మొదలు పెట్టాక పవన్ వీలు ఉన్నప్పుడల్లా షూటింగ్ చేద్దామని అనుకుంటే చేయడం కుదరదు. అందుకే ఉస్తాద్ ఉండగా మరో సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు హరీష్ శంకర్. పవన్ సినిమా లేట్ అవుతుంది అని ఫిక్స్ అయితే రవితేజతో కానీ మరో హీరోతో కానీ హరీష్ శంకర్ సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. మరి అది ఎప్పుడు ఏంటి అన్నది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.