మిస్టర్ బచ్చన్.. ఆ ట్యాగ్ లైన్ ఎందుకంటే..
సినిమాకు సంబంధించిన మీడియా ఇంటరాక్షన్‌లో దర్శకుడు హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మాస్ మహారాజా రవితేజ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందిన "మిస్టర్ బచ్చన్" సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల కానుండగా, ఆగష్టు 14 సాయంత్రం ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.
సినిమాకు సంబంధించిన మీడియా ఇంటరాక్షన్‌లో దర్శకుడు హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాకు "ది ఓన్లీ హోప్" అనే ట్యాగ్ లైన్ ఉంది. దీనికి సంబంధించిన హీరో ప్రత్యేకత ఏమిటని ప్రశ్నించగా.. ఈ సినిమాలో హీరో పాత్రనూ ఎంతో నిజాయతీగా చూపించాం. ఈ కథ 1980ల కాలంలో ఉత్తర భారతదేశంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించాం.
ఆ సమయంలో భారీ లంచాలు ఇచ్చినా ఒప్పుకోని ఒక అధికారికుడు మన స్ఫూర్తి అయ్యాడు.. అని చెప్పారు. అంతే కాదు.. ఈ సినిమాను రవితేజ ఫ్యాన్స్‌కి కావాల్సిన అన్ని మాస్ ఎలిమెంట్లతో రూపొందించాం. ఇందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలు, వినోదం, ప్రేమ అన్నీ కూడా హీరో పాత్రలోని నిజాయతీతో జత కలిపి హైలెట్ చేశాం.
ఇది ఖచ్చితంగా రవితేజ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుంది.. అని హరీష్ శంకర్ అన్నారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ.. మిస్టర్ బచ్చన్ చిత్రానికి ఉన్న పాటలు కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేశాం. ఈ చిత్రంలోని పాటలు అన్ని కూడా పాపులర్ అయ్యేలా ఉన్నాయి.
మిక్కీ చాలా టాలెంటెడ్ అయినా కూడా ఎక్కువ గుర్తింపు పొందడం లేదు. ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు అని చెప్పాడు. తదుపరి, రవితేజ నటన గురించి, "మొత్తం సినిమాకు రవితేజ నటన ప్రత్యేకమైన చరిష్మా ఇవ్వగా, ప్రత్యేకంగా రెండో భాగంలో ఆయన నటన ప్రేక్షకులని మరో స్థాయికి తీసుకెళ్తుంది.. అని హరీష్ తెలిపారు.
అలాగే, కొత్త కథానాయికగా భగ్యశ్రీ బోర్సేను ఎంచుకోవడం వెనుక కారణం..ఈ సినిమా 90ల కాలం నేపథ్యంతో సాగుతుండటంతో, ఒక కొత్త హీరోయిన్ అవసరం కనిపించింది. భగ్యశ్రీ చాలా కష్టపడి నటించింది, ఈ పాత్రకి కరెక్ట్‌గా సరిపోయింది..అని వివరించారు. రెగ్యులర్ సినిమాల కంటే కొంచెం భిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది అని హరీష్ శంకర్ తన వివరణ ఇచ్చారు.