కమల్ సినిమా ఆగి పోయిందా?
దాంతో కమల్ తన పాత సినిమాలను మళ్లీ తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కెరీర్ ఖతం అయ్యింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా విక్రమ్ తో భారీ బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. దాంతో కమల్ తన పాత సినిమాలను మళ్లీ తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదే సమయంలో కొత్త సినిమాలను వరుసగా మొదలు పెట్టాడు.
మణిరత్నం దర్శకత్వంలో సినిమా మొదలుకుని పలు సినిమాల్లో నటించడంతో పాటు, తన సొంత బ్యానర్ లో వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాడు. కమల్ సొంత బ్యానర్ లో రూపొందుతున్న సినిమాల్లో హెచ్ వినోద్ దర్శకత్వంలో సినిమా ఒకటి అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
కమల్ హాసన్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ మంచి కథను దర్శకుడు హెచ్ వినోద్ రెడీ చేశాడు అని, కమల్ 233వ సినిమాగా వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.
కమల్ నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా తమ రాబోయే సినిమాల జాబితా ను ప్రకటించడం జరిగింది. అందులో కమల్ 233 సినిమా లేకపోవడంతో హెచ్ వినోద్ దర్శకత్వంలో కమల్ సినిమా లేదు అనే ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.
థగ్ లైఫ్, కమల్ 237, శివ కార్తికేయన్, శింబు సినిమాలు ప్రస్తుతం రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ లో రాబోతున్నట్లు ఎక్స్ లో అధికారికంగా పేర్కొన్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలోని సినిమా నిర్మాణ సంస్థ మారిందా లేదంటే సినిమా మొత్తంగా క్యాన్సిల్ అయ్యిందా అంటూ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.