సెల్పీ అడిగితే చిరాకు ప‌డిన హేమామాలిని

సెల‌బ్రిటీలు సాధార‌ణ జ‌నాల్లో క‌నిపిస్తే అభిమానంతో సెల్పీలు అడ‌గ‌డం స‌హ‌జం. అలాంటి స‌మ‌యంలో భారీ జ‌న‌సందోహంలో ఫోటోలు ఇవ్వ‌డం అన్న‌ది క‌ష్ట‌మైన ప‌ని.

Update: 2024-01-11 23:30 GMT

సెల‌బ్రిటీలు సాధార‌ణ జ‌నాల్లో క‌నిపిస్తే అభిమానంతో సెల్పీలు అడ‌గ‌డం స‌హ‌జం. అలాంటి స‌మ‌యంలో భారీ జ‌న‌సందోహంలో ఫోటోలు ఇవ్వ‌డం అన్న‌ది క‌ష్ట‌మైన ప‌ని. కానీ చాలా మంది సెల‌బ్రిటీలు కాదు అన‌కుండా ఎంతో స‌హ‌నంతో సెల్పీలు ఇస్తుంటారు. అభిమానం అనే దానికి కొల‌మానం లేదు కాబ‌ట్టి హీరో..హీరోయిన్తు అభిమానుల ప‌ట్ల అంతే ప్రేమ‌ని చూపిస్తుంటారు. తాజాగా ఓ సీనియ‌ర్ న‌టి సెల్పీ అడిగితే ఏమ‌న్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

మ‌ళ్లీ సెల్పీ అడ‌గాలంటే ఆలోచించుకునేలా ఆమె ఆన్ ది స్పాట్ లో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవలే ముంబైలో జరిగిన ప్రముఖ రచయిత గుల్జార్‌ బయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి సీనియ‌ర్ న‌టి హేమా మాలిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమాని హేమమాలినీని సెల్ఫీ ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె చిరాకుపడ్డారు. `నీకు సెల్ఫీ ఇవ్వడానికి కాదు ఇక్కడకు వచ్చింది` అని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. దీంతో నెటి జ‌నులు ఆమెపై మండిప‌డుతున్నారు. `సెల్ఫీ అడిగితే ఇంత పొగరుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది అభిమానిస్తే స్టార్ అయ్యారు. ఆ హోదాని ఆస్వాది స్తున్నారు. అలాంటి అభిమాని సెల్పీ అడిగితే ఏమాత్రం గౌర‌వించ‌కుండా ..అగౌవ‌ర‌ప‌ర‌చ‌డం అన్న‌ది ఎంత‌వ‌ర‌కూ న్యాయ‌మో ఆమె ఆలోచించుకోవాల‌ని నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

నిజానికి అక్క‌డ అంత క్రౌడ్ కూడా లేదు. అయినా ఆమె అస‌హాన్ని వ్య‌క్తం చేయ‌డం చాలా మందిని నిరాశ ప‌రించింది. ఓ సెల్పీ ఇచ్చి ఉంటే ఇంత నెగిటివిటీ వ‌చ్చేది కాద‌ని ఆమె అభిమానులు సైతం చెబుతున్నారు.

Tags:    

Similar News