గోవాలో గాయ‌నితో దొరికిన స్టార్ హీరో.. అందుకే విడాకులు?

ప్ర‌ముఖ ద‌క్షిణాది హీరో ఇటీవ‌లే భార్య‌తో విడాకులు ప్ర‌క‌టించాడు.

Update: 2024-09-20 08:03 GMT

ప్ర‌ముఖ ద‌క్షిణాది హీరో ఇటీవ‌లే భార్య‌తో విడాకులు ప్ర‌క‌టించాడు. ఈ ఆక‌స్మిక ప్ర‌క‌ట‌న‌కు ఆమె కూడా షాక్ కి గురైంది. త‌నతో సంప్ర‌దింపులు లేకుండా, త‌న‌ అంగీకారం లేకుండా అత‌డు విడాకులు ప్ర‌క‌టించాడ‌ని, పెద్ద‌ల‌తో మాట్లాడి ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని కూడా ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఇంకా మాట్లాడి ప‌రిష్క‌రించుకు స్టార్ హీరో భార్య ప్ర‌య‌త్నిస్తున్నార‌ని కూడా మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

సౌత్‌లో మంచి పేరున్న హీరో ఇలా హ‌డావుడిగా త‌న‌ 15 ఏళ్ల వివాహాన్ని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకోవ‌డంపై చాలా రూమ‌ర్లు ఉన్నాయి. ప్ర‌స్తుతానికి గోప్యత కోసం అభ్యర్థించడంతో అభిమానులు స‌ద‌రు హీరో నిర్ణయాన్ని గౌరవించారు. అయితే నక్కీరన్ అనే మీడియా.. బెంగళూరుకు చెందిన గాయనితో స్టార్ హీరోకి ఉన్న రహస్య సంబంధమే భార్యాభ‌ర్త‌ల న‌డుమ‌ వివాదానికి కారణమని వెల్ల‌డించింది. స‌ద‌రు స్టార్ హీరో గోవాలో గాయనితో క‌లిసి వెకేష‌న్‌ని ఎంజాయ్ చేసారు. ఇది త‌న భార్య‌కు మరింత కోపం తెప్పించింది. జూన్‌లో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాయనికి గోవా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కాగా గతంలో గాయని ఉపయోగించిన అదే కారులో అతివేగంగా ప్రయాణించినందుకు స్టార్ హీరోకు గోవా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. స్టార్ హీరో అత‌డి స్నేహితురాలైన బెంగ‌ళూరు గాయ‌ని ఒకే కారును ఉపయోగించడం వారి సంబంధాన్ని పరోక్షంగా ధృవీకరించిందని న‌క్కీర‌న్ క‌థ‌నం వెలువ‌రించింది.

ప్ర‌స్తుతం భ‌ర్త‌తో సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆమె తన రెండు కుటుంబాల మద్దతును కూడ‌గ‌డుతోంద‌ని సమాచారం. ఇటీవ‌లే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన స‌ద‌రు స్టార్ హీరో త‌దుప‌రి త‌న సినిమాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన ఓ మూవీ సీక్వెల్ లోను న‌టిస్తున్నాడు. కానీ దానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

Tags:    

Similar News