సీనియర్లకంటే జూనియర్లే బెటర్ అంటున్నాడా?
అప్పటి నుంచి ఆ హీరో సీనియర్ దర్శకులు కంటే జూనియర్ దర్శకులే బెటర్ అని వాళ్లతోనే సినిమాలు కమిట్ అవుతున్నట్లు కనిపిస్తుంది.
ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఆ యంగ్ హీరో వేగానికి ఒక్కసారిగా ఓ స్టార్ డైరెక్టర్ బ్రేక్ వేసాడు. ఓ భారీ ప్లాప్ ఇవ్వడంతో ఎక్కడలేని విమర్శలన్నీ ఎదుర్కున్నాడు. దెబ్బకి అనుకున్న రెండో సినిమా కూడా అర్ధంతరంగా ఆపేసి మరో సినిమా చేసాడు. ఈ విషయంలో హీరో వెంటనే బాగానే అలెర్ట్ అయ్యాడు. లేదంటే అదీ ప్లాప్ అయితే సీన్ మొత్తం మళ్లీ మొదటికి వచ్చేది. మరి ఈ అలెర్ట్ ఐడియా తన సొంతంగా వచ్చిందా? సీనియర్లు ఎవరైనా ఇచ్చారా? అన్నది తెలియదుగానీ నిర్ణయమైతే మంచిదే అయింది.
అప్పటి నుంచి ఆ హీరో సీనియర్ దర్శకులు కంటే జూనియర్ దర్శకులే బెటర్ అని వాళ్లతోనే సినిమాలు కమిట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ యంగ్ హీరో లైనప్ చూస్తే అంతా కొత్త కుర్రాళ్లు.. .నాలుగైదు సినిమాలు చేసిన దర్శకులే కనిపిస్తున్నారు. అవసరం మేర కోలీవుడ్..శాండిల్ వుడ్ కి కూడా వెళ్లిపోతు న్నాడు గానీ...ఇక్కడున్న సీనియర్లతో ఇప్పట్లో వద్ద అనేస్తున్నాడని తాజాగా తెలిసింది.
ఇటీవలే ఓ ఇద్దరు దర్శకులు కూడా ఆ హీరోకి కథ వినిపించారు. స్టోరీ అంతా బాగానే ఉందిట. కానీ సినిమా చేయాలంటే ముందున్న చిత్రాలు పూర్తవ్వాలి అప్పటివరకూ నా చేతుల్లో ఏం లేదని స్కిప్ కొట్టినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మరి అంత నచ్చనప్పుడు ఎస్కేప్ అవ్వడం దేనికి..నేరుగా చెప్పేయోచ్చు కదా? అనొచ్చు. కానీ అలా అనలేని పరిస్థితి. మనసులో వాళ్లతో పనిచేయాలని ఉన్న తాజా పరిస్థితుల్లో దైర్యంగా నిర్ణయం తీసుకోవడంలో వైఫల్యం ఎదురవుతుందనే భయంతోనే తాత్కాలికంగా మాత్రమే ఎస్కేప్ అయ్యాడుట.
వరుసగా నాలుగైదు విజయాలు వచ్చిన తర్వాత సీనియర్లతో పనిచేస్తే బాగుంటుందని..అప్పుడు మార్కెట్ కూడా మెరుగ్గా ఉంటుందని ఆలోచనతో ఆ ఇద్దరు సీనియర్లని హోల్డ్ లో పెట్టినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. దర్శకుడికి ఇంతవరకూ ఫెయిల్యూర్ లేదు. దీంతో ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి. ఈ సినిమా తర్వాత ముందుగా కమిట్ అయిన చిత్రాలు పట్టాలెక్కించనున్నాడు.