భయాన్ని..బాధని మనసులో దాచేసి కెమెరా ముందుకిలా!
ఎంతో మంది అభిమానుల్ని అలరించిన పూనమ్ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన వార్త ఉదయాన్నే జీర్ణించుకోవడం ప్రతి అభిమానికి ఎంతో కష్టంగా మారింది.
కోట్లాది మంది హృదయాల్లో రంగుల బాణాలు విసిరిన పూనమ్ పాండే మృతితో ఒక్కసారిగా ఇన్ స్టా గ్రామ్ మూగ బోయింది. ఎంతో మంది అభిమానుల్ని అలరించిన పూనమ్ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన వార్త ఉదయాన్నే జీర్ణించుకోవడం ప్రతి అభిమానికి ఎంతో కష్టంగా మారింది. ఈ వార్త నిజంగా నిజమేనా? లేక గాలి వార్తని ఇలా ప్రసారం చేస్తున్నారా? అని అనుకునేలోపే పిడుగు లాంటి నిజం బయటకు వచ్చింది.
శుక్రవారం తెల్లవారుజామునే ఆమె మృతి చెందినట్లు మేనేజర్ మీడియాకి వెల్లడించడంతో విషయం అధికారికమైంది. సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతు తుది శ్వాస విడచినట్లు తెలుస్తోంది. అయితే పూనమ్ పాండేకి క్యాన్సర్ అన్న విషయం మాత్రం ఇంతవరకూ ఆమె మృతి చెందేవరకూ ఎక్కడా బయటకు రాలేదు. దీంతో హఠాన్మరణం వెనుక క్యాన్సర్ అన్న సంగతి ఆమెకైనా తెలుసా? అన్న సందేహం రావడం సహజం.
ఎందుకంటే సోమవారమే పూనమ్ పాండే మీడియా కెమెరాలకి ఫోజులిచ్చింది. ఓ ఈవెంట్ కి హాజరైన సమయంలో ఆమె నవ్వుతూ ఫోజులిచ్చి అందిర్నీ అలరించింది. అప్పుడు ఎక్కడా పూనమ్ అనారోగ్య పరిస్థితి గురించి చర్చకు రాలేదు. అయితే పూనమ్ అందం మాత్రం కళ తప్పింది. మునుపటిలా ఆమె అంత యాక్టివ్ గా కనిపించలేదు. మనిషి రూపంలోనూ మార్పులొచ్చాయి.
కానీ అది మహమ్మారి అని ఎవరూ అనుకోలేదు. బాధనంతా పంటికింద బిగబెట్టి కెమారాకి ఫోజులిచ్చిందని ఇప్పుడు అర్దమవుతుంది. తాను వెళ్లిపోతూ కూడా తన అభిమానుల్ని మాత్రం తనదైన శైలిలోనే నవ్వుతూ అలరించి...కవ్వించింది. కానీ అదే అభిమానుల కంట ఇప్పుడు కన్నీరు పెట్టించింది. కన్నీటి వీడ్కోలు చెప్పించుకుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి అభిమాని బరువెక్కిన గుండెతో ఆమె జ్ఞాపకాల్ని తలుచుకుంటున్నారు.