టైర్ 2 హీరోల హైయెస్ట్ బిజినెస్.. టాప్ లిస్ట్ ఇదే!
మార్కెట్ పరంగా చూసుకుంటే టైర్ 2 హీరోలపై చాలా వరకు జరిగే బిజినెస్ 50 కోట్ల లోపే ఉంటుంది.
టాలీవుడ్ లో టైర్ 1 హీరోల మీద వంద కోట్లకి పైగా థీయాట్రికల్ బిజినెస్ ప్రస్తుతం జరుగుతోంది. ప్రభాస్ మీద అయితే 300 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రభాస్ రేంజ్ ని అందుకునే దిశగా అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే టైర్ 2 హీరోల బిజినెస్ ఇంకా హాఫ్ సెంచరీ దగ్గరే ఉంది. వీరి సినిమాలకి కలెక్షన్స్ కొన్ని మంచి వసూళ్లని రాబడుతున్నాయి. మార్కెట్ పరంగా చూసుకుంటే టైర్ 2 హీరోలపై చాలా వరకు జరిగే బిజినెస్ 50 కోట్ల లోపే ఉంటుంది.
టాలీవుడ్ టైర్ 2 హీరోలలో ఇప్పటి వరకు అత్యధిక థీయాట్రికల్ బిజినెస్ జరిగింది విజయ్ దేవరకొండ మీద. ఆయన నటించిన లైగర్ మూవీపైన భారీ స్థాయిలో వ్యాపారం జరిగింది. ఈ మూవీకి పూరి జగన్నాథ్ ఇమేజ్ తోడవడంతో 91 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరగడం విశేషం. అయితే అందులో సగం కలెక్షన్స్ ఈ మూవీ వసూళ్లు చేయలేకపోయింది. సెకండ్ హైయెస్ట్ బిజినెస్ విజయ్ దేవరకొండ ఖుషి సినిమాపై జరిగింది. 51 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ ఈ చిత్రంపై జరగగా బ్రేక్ ఈవెన్ మాత్రం అందుకోలేకపోయింది.
నాని దసరా సినిమాపై 50 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ మూవీ వంద కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. టైర్ 2 హీరోలలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో టాప్ లో ఇదే ఉంది. రామ్ స్కంద మూవీపై 46 కోట్ల వ్యాపారం జరిగింది. ఇందులో సగం కలెక్షన్స్ కూడా ఈ మూవీకి రాలేదు. భారీ డిజాస్టర్ అయ్యింది. అఖిల్ మొదటి సినిమా అఖిల్ పైన 46 కోట్ల వ్యాపారం జరిగింది. అది కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ 45 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ తో టాప్ 6లో ఉంది. ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో కచ్చితంగా దసరా కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. రామ్ పోతినేని ది వారియర్ పైన 40 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. అఖిల్ ఏజెంట్ పై 37 కోట్ల వ్యాపారం జరిగితే అందులో 20 శాతం కూడా రికవరీ చేయలేదు.
ఈ ఎనిమిది సినిమాలలో ఇప్పటి వరకైతే దసరా మాత్రం బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించడమే కాకుండా భారీ లాభాలని డిస్టిబ్యూటర్స్ కి అందించింది. హైయెస్ట్ బిజినెస్ జరిగిన మూవీస్ లో టాప్ 2 చిత్రాలు విజయ్ దేవరకొండవే కావడం విశేషం. బిజినెస్ పరంగా టాప్ 7లో ఉన్న ఫ్యామిలీ స్టార్ కచ్చితంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స్ రాబడుతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది. మరి ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి వచ్చే ఈ మూవీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
టైర్-2 హీరోలలో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ (మల్టీస్టారర్లు కాకుండా)
1) లైగర్ - 90cr
2)కుషి - 51Cr
3) దసరా - 50cr
4) స్కంద - 46CR
5) అఖిల్ (పవర్ ఆఫ్ జువా) - 46cr
6) ఫ్యామిలీస్టార్ - 45CR
7) ది వారియర్ - 40CR+
8) ఏజెంట్ - 37CR