తెలుగులో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలివే..

విదేశాలలో కూడా అద్భుతంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి తెలుగు సినిమా శైలిని మార్చేసి పాన్ ఇండియా లెవల్ కి తీసుకొని వెళ్లారు.

Update: 2024-01-27 04:26 GMT

ఈ మధ్యకాలంలో తెలుగు మూవీకి పాన్ ఇండియా బ్రాండ్ వచ్చింది. కేవలం మాతృభాషకి పరిమితం కాకుండా దర్శకులు, హీరోలు తమ కథలని గ్రాండియర్ గా బిగ్ స్కేల్ పైన ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కథలలో ప్రాంతీయ మూలాలు విడిచిపెట్టకుండా యూనివర్సల్ అప్పీల్ తో కథనాలు చెబుతున్నారు. ఈ కారణంగా సౌత్ ఇండియన్ కంటెంట్ ని నేషనల్ వైడ్ గా మంచి ఆదరణ లభిస్తోంది.

విదేశాలలో కూడా అద్భుతంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి తెలుగు సినిమా శైలిని మార్చేసి పాన్ ఇండియా లెవల్ కి తీసుకొని వెళ్లారు. ఇప్పుడు అందరూ అతన్ని ఫాలో అవుతూ యూనివర్శల్ గా కథలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండటం వలన కొత్తదనం ఉన్న కంటెంట్ లు ఆడియన్స్ కి వస్తున్నాయి. స్టార్ హీరోలు అందరూ రెగ్యులర్ కమర్షియల్ లైన్ నుంచి పూర్తిగా బయటకొచ్చి హైవోల్టేజ్ కథలతో మూవీస్ చేస్తున్నారు.

ఈ మూవీస్ కి అద్భుతమైన ఆదరణ లభించడంతో పాటు కలెక్షన్స్ కూడా బీభత్సంగా వస్తున్నాయి. నిర్మాతలకి విపరీతమైన లాభాలు తెచ్చి పెడుతున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక లాభాలు తెచ్చి పెట్టిన సినిమాల జాబితా చూసుకుంటే యధావిధిగా అందులో రాజమౌళి చేసిన బాహుబలి 2 టాప్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే బాహుబలి 1, ఆర్ఆర్ఆర్ సినిమాలు నిలిచాయి.

హైలైట్ ఏంటంటే ఇప్పుడు నిర్మాతకి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలో ప్రశాంత్ వర్మ హనుమాన్ ఏకంగా టాప్ 4 లోకి వచ్చింది. ఈ సినిమా ఏకంగా 91.29 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. కేవలం 29.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయ్యి సంచలన కలెక్షన్స్ ని నమోదు చేసింది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కి ఈ చిత్రం దగ్గరగా ఉంది.

ఓవరాల్ గా చూసుకుంటే సినిమాల ప్రాఫిట్, బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి.

బాహుబలి 2 - 508Cr(352CR)

బాహుబలి 1: 186Cr(118Cr)

ఆర్ఆర్ఆర్ - 163.03Cr(451Cr)

హనుమాన్ - 91.29CR(29.65CR)******

అల వైకుంఠపురంలో - 75.88Cr(84.34Cr)

గీతా గోవిందం - 55.43Cr(15Cr)

ఎఫ్2 - 50Cr(34.5Cr)

వాల్తేర్ వీరయ్య - 48.85Cr(88Cr)

రంగస్థలం - 47.52Cr(80Cr





 


Tags:    

Similar News