నాన్న ఏమోషన్ లో లవ్ జర్నీ
నేచురల్ స్టార్ నాని స్క్రిప్ట్ సెలక్షనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
నేచురల్ స్టార్ నాని స్క్రిప్ట్ సెలక్షనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దసరా లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తర్వాత.. హాయ్ నాన్న అనే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. అలాగే ఓ ఎమోషనల్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
ఫాదర్ అండ్ డాటర్ క్యూట్ బాండింగ్ సీన్స్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్‌లో ఆ తర్వాత నాని - మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ జర్నీని బాగా చూపించారు. మరి ఆ పాప నిజంగానే నాని కూతురేనా? పాప జీవితంలోకి రాకముందే నానికి మృణాల్తో ఏమైనా పరిచయముందా? పెళ్లి ఫిక్స్ అయిన మృణాల్.. పాప తండ్రిగా ఉన్న నానికి ఎందుకు ప్రపోజ్ చేసింది? ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.
ఈ సినిమాతో డైరెక్టర్ శౌర్యవ్ పరిచయం కాబోతున్నారు. ఓ డెబ్యూ డైరెక్టర్‌కు.. కథలో భావోద్వేగాలను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ శౌర్యవ్ తన తొలి సినిమాలోనే వాటిని బాగా హ్యాండిల్ చేసినట్టు అర్థమవుతోంది. ప్రతీ తండ్రి - కూతురికి సినిమా కనెక్ట్ అయ్యేలా..ఈ సినిమా తెరకెక్కించనట్లు కనిపిస్తోంది.
నాని యాక్టింగ్ అద్భుతంగా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ ఎమోషనల్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. టీజర్లో రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించారు. ఒకదాంట్లో చాలా యంగ్‌గా మరో గెటప్‌లో మిడిల్ ఏజ్డ్ పర్సన్‌లా కనిపించారు. మృణాల్ ఠాకూర్.. తన చార్మింగ్ ఫేస్ అండ్ యాక్టింగ్‌తో స్క్రీన్ ప్రెజన్స్ బాగా ఇచ్చింది. పాప కియారా ఖన్నా కూడా ఎంతో క్యూట్‌గా నటించింది.
సను జాన్ ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా క్యాప్టర్ చేశారు. అలానే హేషమ్ అబ్దుల్ వాహబ్ కూడా సన్నివేశాలకు తగ్గట్టుగా మ్యూజిక్‌ను మనసుకు హత్తుకునేలా అందించారు. అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. సతీశ్ ఈవీవీ ఎక్స్క్యూటిగ్ ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫస్ట్ క్లాస్‌గా ఉన్నాయి. ప్రవీన్ ఆంథోనీ ఎడిటర్‌గా వ్యవహరించారు. కాస్టూమ్ డిజైనర్ శీతల్ శర్మ. మొత్తంగా ఈ టీజర్ ప్రామిసింగ్‌గా ఉంది. ఎమోషనల్‌గా సాగిన ఈ ప్రచార చిత్రం... సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 7న రిలీజ్ కానుంది.