హీరోతో పడుకోవాలని బలవంతం చేసాడు!
#మీటూ ఉద్యమంలో చాలా మంది కథానాయికలు తమకు జరిగిన అన్యాయాలను బహిరంగంగా చర్చించారు.
#మీటూ ఉద్యమంలో చాలా మంది కథానాయికలు తమకు జరిగిన అన్యాయాలను బహిరంగంగా చర్చించారు. లైంగిక వేధింపులపై ఓపెనయ్యారు. ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ కథానాయిక.. బేసిక్ ఇన్ స్టింక్ట్స్ ఫేం షరాన్ స్టోన్ సంచలన ఆరోపణలు చేసారు. తనను సహనటుడితో మంచంపై పడుకోవాలని ఒత్తిడి తెచ్చాడని తన నిర్మాతపై ఆరోపించింది.
బేసిక్ ఇన్‌స్టింక్ట్ ఫ్రాంచైజీ, ది స్పెషలిస్ట్ (1994), క్యాసినో (1995), టోటల్ రీకాల్ (1990) లాంటి బ్లాక్ బస్టర్లలో తన పాత్రలతో చెరగని ముద్ర వేసిన నటి- షరాన్ స్టోన్. సహనటుడు బిల్లీ బాల్డ్‌విన్‌తో పడుకోమని తన నిర్మాత ఎవాన్స్ చెప్పాడని షారన్ స్టోన్ తాజా పాడ్ కాస్ట్ లో వెల్లడించారు. అంతేకాదు సదరు నటుడు కం నిర్మాత తన రహస్యాలను బయటపెడతామని బెదిరించినట్టు తెలిపింది. 30 ఏళ్ల క్రితం సహనటుడు బిల్లీ బాల్డ్‌విన్‌తో కలిసి మంచాన్ని షేర్ చేసుకోవాలని నిర్మాత రాబర్ట్ ఎవాన్స్ తనను బలవంతం చేశారని షారోన్ స్టోన్ ఆరోపించింది. ఆమె ఆరోపణలపై నటుడు బిల్లీ కూడా ధీటుగా స్పందించారు.
షారన్ స్టోన్ ఇటీవలే తాను నటించిన 1993 మిస్టరీ-థ్రిల్లర్ `స్లివర్` గురించి ప్రస్థావిస్తూ.. ఇటీవలి పోడ్‌కాస్ట్‌లో బిల్లీ బాల్డ్‌విన్‌తో నటించిన విషయాన్ని ప్రస్థావించింది. నిర్మాత రాబర్ట్ ఎవాన్స్ తనపై ఒత్తిడి తేవడం గురించి షరాన్ తన గత అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ కొన్ని షాకింగ్ వాదనలు చేసింది. షారోన్ వివరాల ప్రకారం.. దివంగత నిర్మాత రాబర్ట్ ఎవాన్స్ తనను ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని మెరుగుపరిచేందుకు ఆఫ్-స్క్రీన్‌లో బాల్డ్‌విన్‌తో సన్నిహితంగా ఉండమని బలవంతం చేశాడు. కథానాయకుడు తన నటనను మెరుగుపరుచుకునేందుకు ఇది సహాయపడుతుందని రాబర్ట్ భావించాడని తెలిపింది.
రాబర్ట్ ఎవాన్స్‌పై షాకింగ్ ఆరోపణలు:
షరాన్ తన వైరల్ పోడ్‌కాస్ట్‌లో ఇలా చెప్పింది. అతడు (ఎవాన్స్) నన్ను తన కార్యాలయానికి పిలిచాడు. అక్కడ చాలా తక్కువ సైజ్ 70, 80ల నాటి మంచాలు ఉన్నాయి. కాబట్టి నేను సెట్‌లో ఉండాల్సిన సమయంలో తప్పనిసరై నేలపై కూర్చున్నాను. అతడు (ఎవాన్స్) అవా గార్డనర్‌తో పడుకున్నాడని.. నేను బిల్లీ బాల్డ్‌విన్‌తో పడుకోవాలని చెప్పాడు. ఎందుకంటే నేను బిల్లీ బాల్డ్‌విన్‌తో పడుకుంటే అతడి పనితీరు మెరుగవుతుంది.. మాకు బిల్లీ అవసరం. సినిమాలో బాగుండాలి.. ఎందుకంటే అదే సమస్య... అని తన నిర్మాత ఎవాన్స్ అన్నాడని 66 ఏళ్ల షరాన్ తాజా పాడ్ కాస్ట్ లో ఇన్నేళ్ల తర్వాత ఆరోపించారు.
వీళ్లకు అసలు సమస్య నేనే.. ఎందుకంటే నేను చాలా నిటారుగా ఎత్తుగా ఉన్నాను. కాబట్టి అతడిని ఎఫ్%*# చేసి పరిస్థితిని తిరిగి అదుపులోకి తేగలిగితే వారికి చాలు. అసలు సమస్య ఏమిటంటే నేను చాలా కఠినంగా ఉన్నాను. `బేసిక్ ఇన్‌స్టింక్ట్`లో రోమాంచిత సన్నివేశాలు ఉన్నప్పటికీ మైఖేల్ డగ్లస్‌తో తనకు అలాంటి అసహ్యకరమైన అనుభవాలు లేవని ఎత్తి చూపుతూ ఎవాన్స్ పై ఆరోపించింది.
ఆరోపణలను కొట్టి పారేసిన బిల్లీ బాల్డ్‌విన్
X ఖాతాలో షరాన్ స్టోన్ చేసిన ఆరోపణలపై బిల్లీ విరుచుకుపడ్డాడు. అతడు ఇన్ స్టాలో ఇలా రాసాడు. ఇన్నాళ్లు గడిచినా షరాన్ స్టోన్ నా గురించి ఎందుకు మాట్లాడుతోందో కచ్ఛితంగా తెలియదు. ఆమెకు ఇప్పటికీ నాపై ప్రేమ ఉందా లేదా? నేను ఆమె అడ్వాన్స్‌లకు అడ్డంకిగా మారినందున ఇన్నేళ్ల తర్వాత కూడా బాధపడిందా? ఏం జరిగిందో నాకు తెలీదు అని వాదించాడు.
సినిమాలో చివరి సెక్స్ సన్నివేశాన్ని కొరియోగ్రాఫ్ చేయడానికి నన్ను అనుమతించింది కాబట్టి నేను షరాన్‌ను ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక పుస్తకం రాసి షరాన్ గురించి కలతపెట్టే అసహ్యకరమైన వృత్తిపరంగా లేని కథలను చెప్పాలా? అని అతడు ప్రతిదాడి చేసాడు.