ఎలా ఎప్పుడు? ఎందుకు అనిపిస్తుంది!
రెండు చిత్రాల్లోనూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కడంతోనే రష్మికకి ఆ రేంజ్ ఫాలోయింగ్ తక్కువ సమయంలోనే సాధ్యమవుతుంది.
నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న ఏ రేంజ్ హీరోయిన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప'... 'యాని మల్' విజయాలతో అమ్మడు స్థాయి ఒక్కసారిగా ఛేంజ్ అయింది. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెండ్ బ్యూటీగా మారిపోతుంది. రెండు చిత్రాల్లోనూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దక్కడంతోనే రష్మికకి ఆ రేంజ్ ఫాలోయింగ్ తక్కువ సమయంలోనే సాధ్యమవుతుంది. దీంతో బాలీవుడ్ యంగ్ హీరోలంతా ఆమెతో నటించడానికి రెడీగా ఉన్నారు.
రష్మికలో చలాకీతనం సైతం అక్కడి ఆడియన్స్...సెలబ్రిటిల్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ తరహాలోనే అమ్మడు బాలీవుడ్ లోనూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుం టుందని ధీమా వ్యక్తమవుతుంది. తాజాగా రష్మిక సినీ జర్నీ ప్రారంభించి ఏడేళ్లు పూర్తువుతంది. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా సినీ ప్రయాణంలో కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎలా ఎప్పుడు.. ఎందుకు జరుగుతుందనిపిస్తుంది.
సినీ పరిశ్రమలోకి రావడం ఆనందంగా...గర్వంగా ఉంది. నేను కలలు కన్నది ఈ జీవితం కోసమే. చిత్రసీమ లోకి ఎలాంటి పరిచయాలు లేకుండానే వచ్చాను. మంచి జీవితం కోసం నేటికి పరుగులు తీస్తూనే ఉన్నాను. సరైన వ్యక్తులు తోడుగా ఉండటం వల్ల సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్లగలిగాను. కలలు కంటు పెరిగిన నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడు 'పుష్ప-2'.. 'రెయిన్ బో' ..'ది గర్ల్ ప్రెండ్'..'ఛావా' సినిమాల్లో నటిస్తోంది.
రష్మికని సినిమాల్లోకి తీసుకొచ్చింది కన్నడ నటుడు రక్షిత్ శెట్టి అన్న సంగతి తెలిసిందే. 'కిరిక్ పార్టీ' లో రక్షిత్ కి జోడీగా నటించింది. అదే అమ్మడి తొలి సినిమా. ఆ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ప్రేమించుకోవడం...నిశ్చితార్దం చేసుకోవడం...అది వీగిపోవడం అన్నీ అలా జరిగిపోయాయి.