కపుల్ గోల్స్: బికినీ బీచ్‌లో ప్రియురాలితో గ్రీక్ గాడ్
బికినీ బీచ్ లో చెలికాడు చెలికత్తె ఒకరికోసం ఒకరుగా కనిపిస్తే..! ఆస్వాధించే కళాత్మక హృదయం ఉండాలే కానీ వయసుతో పనే లేకుండా జత కుదురుతుంది
బికినీ బీచ్ లో చెలికాడు చెలికత్తె ఒకరికోసం ఒకరుగా కనిపిస్తే..! ఆస్వాధించే కళాత్మక హృదయం ఉండాలే కానీ వయసుతో పనే లేకుండా జత కుదురుతుంది. ఇదిగో ఇక్కడ స్టార్ హీరో హృతిక్ రోషన్ 51 వయసులో తన గాళ్ ఫ్రెండ్ సాబా ఆజాద్‌తో తనివి తీరా ఆస్వాధనలో ఉన్నాడు. కొత్త సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే 10 రోజులు పూర్తయింది. అయినా ఇంకా హృతిక్ ఆ మూడ్ నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు లేడు.
హృతిక్ - సాబా ఎప్పటిలానే రొమాంటిక్ మూడ్ లోకి జారుకున్నారు. సఖుడు తన 51వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న సమయంలో అతడి లేడీ లవర్ సబా ఆజాద్ ఈ సందర్భాన్ని అతడి కోసం మరింత ప్రత్యేకంగా మార్చారు! సాబా తన సోషల్ మీడియా ద్వారా ఒక రొమాంటిక్ పోస్ట్‌ను షేర్ చేసింది. అతడి కోసం సింపుల్ గా ఒక చిన్న నోట్ రాసింది.
సబా ఆజాద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రియుడు హృతిక్ రోషన్‌తో కలిసి ఉన్నప్పటి వరుస ఫోటోలను షేర్ చేసారు. మొదటి ఫోటో వెకేషన్స్ నుండి వచ్చిన స్పెషల్ ఫోటోగ్రాఫ్. ఈ జంట బీచ్‌లో సెల్ఫీకి పోజులిచ్చింది. సబా ఆకుపచ్చ -తెలుపు చారల బికినీ ధరించింది. హృతిక్, సబా జంట టోన్డ్ లుక్ అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.
ఈ స్పెషల్ ఫోటోషూట కి హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సానే ఖాన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె తనతో పాటు హృతిక్, సబా ఆజాద్, జాయెద్ ఖాన్, నటి గాయత్రి ఒబెరాయ్, అర్స్లాన్ గోని తదితరులతో కూడిన వారి వేడుక నుండి ఒక ఫోటోని పోస్ట్ చేసింది.
హృతిక్ రోషన్ -సబా ఆజాద్ 2022లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత అక్టోబర్ 2022లో వారి సంబంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ అధికారికంగా చేశారు. లండన్ లో వెకేషన్ కోసం వెళ్లిన జంట రిలేషన్ ని అధికారికం చేసింది.