హృతిక్ రోషన్ కి నత్తి..పాఠశాల్లో బెదిరింపులు!
మానసికంగా బలహీనంగా ఉన్న రోహిత్ మెహ్రా అనే యువకుడి పాత్రలో హృతిక్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఒకానొక ఫేజ్ లో వరుస పరాజయాలతో సతమతమవుతోన్న సమయంలోనే 'కోయి మిల్ గయా' ఎలాంటి విజయం అందించిందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క విజయం హృతిక్ ని అన్ని రకాల విమర్శలకు దూరం చేసింది. నటుడిగా తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సినిమా అది. కమర్శియల్ సక్సెస్ తో పాటు విమర్శకులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. బాలీవుడ్ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదారణ పొందిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
మానసికంగా బలహీనంగా ఉన్న రోహిత్ మెహ్రా అనే యువకుడి పాత్రలో హృతిక్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా విడుదలై రెండు దశాబ్ధాలు పూర్తయింది. ఈసందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హృతిక్ ఈ సినిమాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ గా టచ్ చేసారు. నా నిజ జీవితంలోని పాఠాలు...సినిమాలోని పాత్రకు ఓ డీఎన్ ఏలా కలిసిపోయాయి. నా జీవితంలో చాలా చేదు అనుభవాలు చూసాను. పాఠ శాల దశలోనే బెదిరింపులు ఎదుర్కున్నాను.
నాకు నత్తి ఉండేది. మాట్లాడటం సరిగ్గా వచ్చేది కాదు. ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టు ఎలా నంటించాలో? అన్ని అంశాలు నా నిజ జీవితంలో ఉన్నాయి. పాత్రకు తగ్గట్టు ఎలా నటించాలో? నాకు నిజ జీవితం ముందే నేర్పించింది. ఇదొక గొప్ప పాఠ్యంగా భావిస్తాను. మన జీవితంలో మంచి లేదా చెడు సమయం వచ్చినప్పుడే ఉపయోగపడతాయి. ఆ సమయం వచ్చే వరకూ వేచి చూడాలి. ఈ సినిమా కథ చదువుతున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాను. ఈ విషయం మా నాన్నకి కూడా చెప్పాను.
అది చదవడానికి ఆరు నుంచి ఏడు గంటలు పట్టింది. ఎందుకంటే ప్రతీ రెండు మూడు గంటలకు నేను ఏడ్చింది అంతా కథ. నా బట్టలు..హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో మా నాన్న చూడాలనుకున్నారు. కానీ చిత్రీకరణ ప్రారంభమైనంత వరకూ నన్ను చూడలేదు. ఆస్టోరీ అద్భుతం. జీవితంలో ఎన్నో నాకు నేర్చించింది ఆ సినిమా. నన్ను నేనుగా నిరూపించింది' అని అన్నారు. 'కోయి మిల్ గయా 'సీక్వెల్ గానే 'క్రిష్' సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు భాగాలు మంచి విజయాలు సాధించాయి. నాల్గవ భాగం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రారంభం కానుంది.