క్లైమాక్స్: హృతిక్ -ఎన్టీఆర్ త‌న్నుకు చ‌స్తార‌ట‌

అవును.. ఆ ఇద్ద‌రు హీరోలు భూమికి బీట‌లు వేసేలా.. ఆకాశం ద‌ద్ద‌రిల్లేలా త‌న్నుకు చ‌స్తార‌ట.

Update: 2024-10-13 05:11 GMT

అవును.. ఆ ఇద్ద‌రు హీరోలు భూమికి బీట‌లు వేసేలా.. ఆకాశం ద‌ద్ద‌రిల్లేలా త‌న్నుకు చ‌స్తార‌ట. క్లైమాక్స్ పోరాటం నువ్వా నేనా? అన్న రీతిలో హోరాహోరీగా సాగుతుంద‌ని .. గాడ్జిల్లా వ‌ర్సెస్ గొరిల్లా పోరాటం త‌ర‌హాలో ఈ స‌న్నివేశం గ‌గుర్పాటుకు గురి చేస్తుంద‌ని చెబుతున్నారు. అంత‌టి ఇంటెన్స్ యాక్ష‌న్ సీన్ ఏ సినిమాలోనిదో చెప్పాల్సిన ప‌ని లేదు.

బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ తో క‌లిసి, టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌డుమ బిగ్ ఫైట్ గురించిన స‌మాచార‌మిది. ఈ జోడీ మోస్ట్ అవైటెడ్ 2025 మూవీ `వార్ 2`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తార‌క్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ని టాక్ ఉంది. క్లైమాక్స్ లో ఆ ఇద్ద‌రూ నువ్వా నేనా అంటూ మ‌రో లెవ‌ల్లో ఢీకొడ‌తార‌ని, ఈ భీక‌ర‌ పోరాట దృశ్యాన్ని చిత్రీక‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసార‌ని తెలిసింది.

ఈనెల‌ మూడో వారంలో హృతిక్ వ‌ర్సెస్ ఎన్టీఆర్ గ్రాండ్ డ్యాన్స్ ఫేస్ ఆఫ్ షూటింగ్ జరుపుకోనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. నవంబర్ మొదటి వారంలో వార్ 2 క్లైమాక్స్ కోసం ఇద్దరు అగ్ర హీరోలపై హై-వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ ఫేస్ ఆఫ్ సన్నివేశాన్ని కూడా షూట్ చేస్తారని తాజాగా క‌థ‌నాలొస్తున్నాయి. చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే హృతిక్ - ఎన్టీఆర్ ల‌పై సోలో సన్నివేశాలను పూర్తి చేసారు. అందరి కళ్ళు ఇప్పుడు ఇద్ద‌రు భీక‌ర‌మైన హీరోల న‌డుమ ఫేసాఫ్ గురించి ఆస‌క్తిక‌రంగా వేచి చూస్తున్నారు. డ్యాన్సులు, ఫైట్స్ లో ఆ ఇద్ద‌రూ ఎవ‌రికీ తీసిపోరు. అందువ‌ల్ల ఫేసాఫ్ చాలా ఠిపిక‌ల్ గా ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయిక. యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వార్ 2 చిత్రం 14 ఆగస్ట్ 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. 2024-25 సీజన్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో ముందు వ‌రుస‌లో ఉన్న చిత్ర‌మిది. గేమ్ ఛేంజ‌ర్, పుష్ప 2 త‌ర‌హాలో ద‌క్షిణాదినా ఈ మూవీపై క్యూరియాసిటీ నెల‌కొంది. తార‌క్ కి హిందీ డెబ్యూ మూవీ కావ‌డంతో అభిమానుల్లో ఒక‌టే కోలాహాలం క‌నిపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత‌ ఈ సినిమాతో తార‌క్ మ‌రో 1000 కోట్ల క్ల‌బ్ ని అందుకుంటాడా? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    

Similar News