ఓటీటీల్లో సినిమాల జాతర.. వాటిపైనే స్పెషల్ ఫోకస్

కొత్త వారం మొదలైపోయింది. ఎప్పటిలానే పలు సినిమాలు అటు థియేటర్ లో ఇటు ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

Update: 2024-06-17 11:26 GMT

కొత్త వారం మొదలైపోయింది. ఎప్పటిలానే పలు సినిమాలు అటు థియేటర్ లో ఇటు ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఓటీటీలో సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ వారంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ అవుతుండడంతో వేరే పెద్ద సినిమాలేమీ రావడం లేదు. కొన్ని చిన్న చిత్రాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.

ఓటీటీలో బాక్(అరణ్మనై 4), నడికల్ తిలకం సినిమాలతో పాటు మహారాజ్, కోటా ఫ్యాక్టరీ మూడో సీజన్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 20వ తేదీ నుంచి కోటా ఫ్యాక్టరీ మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 19వ తేదీన అదే ఓటీటీలో మహారాజ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. హీరోయిన్లు తమన్నా, రాశీ ఖన్నా నటించిన అరణ్మనై-4 జూన్ 21వ తేదీన డిస్నీ+ హాట్‌స్టార్ లోకి రానుంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మాలీవుడ్ డెబ్యూ మూవీ నడికర్ తిలకం.. జూన్ 21వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమాలో మిన్నల్ మురళి, తల్లుమల, టోవినో థామస్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రలో టోవినో థామస్ ఈ మూవీ కనిపించారు. మరి వీటితో పాటు ఈ వారం వివిధ ఓటీటీల్లో అలరించే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే

నెట్‌ ఫ్లిక్స్

అవుట్‌ స్టాండింగ్‌ (హాలీవుడ్)- జూన్‌ 18

ఏజెంట్‌ ఆఫ్‌ మిస్టరీ (కొరియన్‌ సిరీస్‌)- జూన్‌ 18

అమెరికాస్‌ స్వీట్‌ హార్ట్స్‌ (సిరీస్‌)- జూన్‌ 20

ట్రిగర్‌ వార్నింగ్‌ (ఇంగ్లీష్)- జూన్‌21

గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా (స్పానిష్ ) - జూన్ 21

ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (సిరీస్) - జూన్ 21

రైజింగ్ ఇంపాక్ట్ (సిరీస్) - జూన్ 22

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ లోకి జూన్‌ 21న బ్యాడ్‌ కాప్‌ (హిందీ), ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) రానున్నాయి. జియో సినిమాలో జూన్‌ 16న ది హోల్డోవర్స్‌ (ఇంగ్లీష్‌), జూన్ 17న హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 2 (వెబ్‌సిరీస్), జూన్ 19న ఇండస్ట్రీ (వెబ్‌సిరీస్), జూన్‌ 21న బిగ్‌ బాస్‌ ఓటీటీ 3 (రియాల్టీ షో ) స్ట్రీమింగ్ కానున్నాయి. బుక్ మై షోలో జూన్ 21న లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ మూవీ) రానుంది. ఆహాలో జూన్ 18వ తేదీ నుంచి సీరగన్ (తమిళ సినిమా) అందుబాటులోకి రానుంది.

Tags:    

Similar News