చరణ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?

రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత స్టార్ హీరో రామ్ చరణ్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-05-29 05:43 GMT

రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత స్టార్ హీరో రామ్ చరణ్ క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు చెర్రీ. గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులతోపాటు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. మూవీలో సీతారామరాజు పాత్రలో కనిపించి ఇండియన్ ఆడియన్స్ నే కాదు.. గ్లోబల్ ప్రేక్షకులను కూడా తన వైపు తిప్పుకున్నారు రామ్ చరణ్.

దీంతో చరణ్ నెక్స్ట్ సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్లుగానే.. ఆయన తన అప్ కమింగ్ మూవీస్ ను అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తుండగా.. ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ తో కలిసి చెరో సినిమా చేయనున్నారు చరణ్. ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి.. ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.

ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఉన్న చరణ్.. త్వరలోనే గేమ్ ఛేంజర్ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని.. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను RC 16 మేకర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ డ్రామా జోనర్ లో తెరకెక్కనున్న RC 16 ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి గాను చరణ్ భారీగా పారితోషికం అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.125 కోట్ల రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారట. అంత పెద్ద మొత్తంలో ఇవ్వడానికి RC 16 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా అంగీకరించినట్టు సమాచారం.

మొత్తానికి చరణ్.. రెమ్యునరేషన్ ను బాగా పెంచినట్లు తెలుస్తోంది. 30 శాతం పెంచారని కొందరు అంటుండగా.. గ్లోబల్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. తెలుగులో ప్రభాస్ తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్‌ తీసుకునే హీరోల్లో చరణ్‌ టాప్‌ లో నిలిచారని చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ చరణ్ రెమ్యునరేషన్ గురించి తెలిసి మాత్రం అంతా అవాక్కవుతున్నారు.

Tags:    

Similar News