.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

హైద‌రాబాద్ కి మ‌ళ్లీ ఐమ్యాక్స్ తిరిగొస్తుందా?

ఐమ్యాక్స్ ఫార్మెట్ లో సినిమా వీక్షించ‌డంలో ఓ కిక్ ఉంటుంది. అందుకు చాలా కాలం అడ్డ‌గా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ఐమ్యాక్స్ నిలిచింది

Update: 2024-06-29 12:46 GMT

ఐమ్యాక్స్ ఫార్మెట్ లో సినిమా వీక్షించ‌డంలో ఓ కిక్ ఉంటుంది. అందుకు చాలా కాలం అడ్డ‌గా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ఐమ్యాక్స్ నిలిచింది. అందులో ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసి ప్రేక్ష‌కులు ఐమ్యాక్స్ అనుభూతిని పొందారు. అవ‌తార్ లాంటి సినిమా ఏకంగా ఏడాది అదే థియేట‌ర్లో ఆడింద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన వాస్త‌వం. కేవ‌ల ఐమ్యాక్స్ కార‌ణంగానే అంత గొప్ప‌గా సినిమా ఆడింద‌ని అప్ప‌ట్లో సంస్థ అధినేత స్వ‌యంగా చెప్పారు.

అయితే కాల క్ర‌మంలో అది బిగ్ స్క్రీన్ గా మారింది. దానికి పీసీఎక్స్ గా నామ‌క‌ర‌ణం చేసారు. అప్ప‌టి నుంచి ప్ర‌సాద్స్ క‌ళ త‌ప్పింది అన్న‌ది వాస్త‌వం. ఐమ్యాక్స్ ఫార్మెట్ లో సినిమా చూడ‌లేక‌పోతున్నామ‌నే వెలితి సినీ గోయ‌ర్స్ లో ఎప్పుడూ క‌నిపిస్తూనే ఉంటుంది. మెట్రో సిటీలైన బెంగళూరు, చెన్నై, ముంబై, కొచ్చి, కోల్ క‌త్తా లాంటి ప్ర‌దేశాల్లో ఉన్నా మ‌న హైద‌రాబాలో ఐమాక్స్ లేద‌నే పీల్ చాలా మందిలో ఉంది.

మొన్న రిలీజ్ అయిన `క‌ల్కి 2898` ఐమ్యాక్స్ లో చూస్తే ఆ కిక్కే వేరుగా ఉండేది. కానీ ఆ ఛాన్స్ లేక‌పోయే. అయితే తాజాగా అందుతోన్న స‌మాచారం ఏంటంటే మ‌ళ్లీ హైద‌రాబాద్ కి ఐమ్యాక్స్ రాబోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పంజాగుట్ట పరిధిలో ఉన్న రెండు పివిఆర్ మల్టీప్లెక్స్ సముదాయం ఐమ్యాక్స్ ఏర్పాటు కు ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలిసింది. గ‌త ప్ర‌భుత్వంలోనే ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎన్నిక‌లు..కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు వంటి అంశాల కార‌ణంగా డిలే అయిన‌ట్లు తెలుస్తోంది.

Read more!

తాజాగా అవ‌న్నీ ఓ కొలిక్కి రావ‌డంతో మ‌ళ్లీ ఐ మ్యాక్స్ ఏర్పాటు ప‌నులు పున ప్రారంభం అవుతున్నాయని విశ్వ‌స‌నీయ స‌మాచారం. అదే జ‌రిగితే హైద‌రాబాద్ వాసులకు ఆనంద‌మే. ఇప్ప‌టికే న‌గ‌రంలో మల్టీప్లెక్స్ లు జోరుగా విస్త‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నేరుగా స్టార్ హీరోలే వ్యాపారంలోకి దిగ‌డంతో మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ రంగు కూడా మారింది. కార్పోరేట్ కంపెనీలు కోట్లాది రూపాయ‌ల‌తో అధునాత‌న స‌దుపాయాల‌తో నిర్మిస్తున్నాయి. ఐమ్యాక్స్ ఏర్పాటు జ‌రిగితే గ‌నుక టికెట్ ధ‌ర్ కూడా అధికంగానే ఉండొచ్చు.

Tags:    

Similar News