అవమానం జరిగిన చోటే సన్మానం.. ఇది కదా సక్సెస్‌

ఈ సందర్భంగా హైపర్‌ ఆది మాట్లాడుతూ.. జబర్దస్త్‌ గురించి కొందరు తక్కువ చేసి మాట్లాడుతారు. కమెడియన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడేవారికి మా కష్టం తెలియదు.

Update: 2024-11-19 06:15 GMT

జబర్దస్త్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో నటిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కొందరు కమెడియన్స్‌గా చేస్తే కొందరు రచయితలుగా, కొందరు దర్శకులుగా చేస్తున్నారు. కొద్ది మంది హీరోలుగానే తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకున్నారు, ముందు ముందు కూడా హీరోలుగా జబర్దస్త్‌ కమెడియన్స్ రాబోతున్నారు. జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్ హీరోగా నటించి నిర్మించిన 'కేసీఆర్‌' సినిమా విడుదలకు సిద్ధం అయింది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి మాజీ మంత్రి రోజాతో పాటు పలువురు జబర్దస్త్‌ కమెడియన్స్ హాజరు అయ్యి రాకేష్‌ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హైపర్‌ ఆది మాట్లాడుతూ.. జబర్దస్త్‌ గురించి కొందరు తక్కువ చేసి మాట్లాడుతారు. కమెడియన్స్ గురించి తక్కువ చేసి మాట్లాడేవారికి మా కష్టం తెలియదు. నవ్వించడం ఎంత కష్టమో తెలిసిన వాళ్లు మాత్రమే మమ్ములను గౌరవంగా చూస్తారు. ఒకప్పుడు కామెడీ కొసం చేసే ప్రయత్నంలో చిన్న తప్పు జరిగితే దాన్ని తప్పుబట్టి కొందరు వేణు అన్నను ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్దకు పిలిపించి అవమానించారు. ఆయన ఆ సమయంలో పడ్డ అవమానంకు సరైన సమాధానం చెప్పారు. బలగం సినిమా తీసి తన గొప్ప ప్రతిభను చాటుకున్నారు.

బలంగా సినిమా తర్వాత ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అక్కడే సన్మానం చేయించుకున్నారు. ఆ రోజు తనకు తగిలిన ప్రతి దెబ్బకు బలగం సినిమా హిట్‌తో రెట్టింపు తిరిగి కొట్టాడు. వేణు అన్న ఎంతో మందికి ఆదర్శం. ప్రతి ఒక్కరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని కష్టపడాలంటూ ఆది చెప్పుకొచ్చాడు. చిన్న చూపు చూసే జబర్దస్త్‌ కి ఈ స్థాయిలో గుర్తింపు, గౌరవం తీసుకు రావడంలో వేణు అన్న కీలక పాత్ర పోషించారని ఆది అన్నారు. ఆయన తనకు జరిగిన అవమానంకు బలగం హిట్ తో మర్యాదను తెచ్చుకున్నారు అంటూ ఆది అన్నారు.

జబర్దస్త్‌ ఆర్టిస్టులు నవ్విస్తారు అంతే కదా అని చాలా మంది చిన్న చూపు చూస్తారు. కానీ నవ్వించడం వెనుక ఎంతటి కష్టం ఉంటుందో తెలిసిన వారు అలా మాట్లాడరు. చాలా రోజుల తర్వాత రోజా గారిని కలవడం జరిగింది. నేను ఆమెను ఏదో అన్నాను అని, ఆమెపై విమర్శలు చేశాను అంటూ యూట్యూబ్‌ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. కానీ నేను ఎప్పుడూ ఆమె గురించి తప్పుగా మాట్లాడలేదు. ఆమెను అగౌరవపరిచే విధంగా నేను ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడలేదు. అయినా కొందరు యూట్యూబ్‌ వ్యూస్ కోసం తమ మధ్య విభేదాలు ఉన్నాయని, విమర్శలు చేసుకున్నట్లుగా పోస్ట్‌ లు పెడుతున్నారని ఆది చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News