సౌత్ నుంచి ఇలియానాను బ్యాన్ చేయడానికి కారణం?
దేవదాస్, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్ లో అగ్ర నాయికగా ఎదిగింది ఇలియానా.
దేవదాస్, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్ లో అగ్ర నాయికగా ఎదిగింది ఇలియానా. ఆ తర్వాత పరిశ్రమ అగ్ర కథానాయికగా దశాబ్ధం పైగానే విజయవంతంగా కొనసాగింది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే అనూహ్యంగా టాలీవుడ్ నుంచి అదృశ్యమైంది. అటుపై తెలుగు-తమిళంలో ఐదేళ్ల పాటు నటించలేదు. ఇలా సడెన్ గా ఇలియానా పరిశ్రమ నుంచి నిష్కృమించడంతో అభిమానులకు సందేహాలు కలిగాయి. సౌత్ నుంచి ముంబై పరిశ్రమకు వెళ్లిపోయిందని అంతా భావించారు.
కానీ ఇలియానా సడెన్ గా కనిపించకపోవడానికి ప్రత్యేక కారణం ఉంది. ఇలియానా డిక్రూజ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుండి నిషేధానికి గురైంది. ఎందుకంటే తన ఒప్పందాన్ని మీరింది. దాదాపు 45లక్షల అడ్వాన్స్ తీసుకుని ఇచ్చిన కాల్షీట్లలో తన పనిని పూర్తి చేయలేదు. ఇలియానా అడ్వాన్స్ అందుకుని కాల్షీట్లు ఇచ్చింది. కానీ ఒప్పందం ప్రకారం సెట్స్ లో జాయిన్ అవ్వకుండా, వేరొక సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఇలియానా వాగ్దానం చేసిన సమయానికి షూట్‌కు హాజరు కాలేదు. దీంతో నిర్మాతలు తెలుగు ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు చేరడంతో దక్షిణ భారత పరిశ్రమల్లోని నాలుగు భాషల్లోను నటించకుండా నిషేధం విధించారు. ఆమెపై ఓ తమిళ నిర్మాత ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్ ఛాంబర్ బ్యాన్ ఆర్డర్‌ను పాస్ చేసింది. ఆమె నిబద్ధత లేని నటి. ఒకరి నుంచి అడ్వాన్స్ తీసుకుని మరొకరి (విజయ్ నన్బన్) సినిమాలో నటించింది! అంటూ నిర్మాత ఒకరు తెలిపారు. ఇలాంటి వారందరికీ గుణపాఠం నేర్పడానికి మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిషేధించాలని కూడా ఆయన అన్నారు.
భవిష్యత్‌లోను ఇలియానా తప్పు చేస్తుంది. ఈరోజు బాలీవుడ్ వాళ్లు తనకు అవకాశం కల్పిస్తే.. హాలీవుడ్ లో నటించేందుకు వెళుతుంది. బాలీవుడ్‌కు ఇచ్చిన కమిట్మెంట్లను పట్టించుకోదు.. అంటూ సదరు నిర్మాత తీవ్రంగా విమర్శించారు. ఇలియానా అత్యంత క్రమశిక్షణ లేని నటి అని కూడా ఆయన దుయ్యబట్టారు.
అయితే ఐదేళ్ల పాటు నిషేధం అనంతరం మాస్ మహారాజా రవితేజ తిరిగి ఇలియానాకు అవకాశం కల్పించారు. అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో ఇలియానా తిరిగి టాలీవుడ్ లో ప్రవేశించింది. కానీ దురదృష్ట వశాత్తూ ఫ్లాప్‌ను ఎదుర్కొంది. సౌత్ లోనే కాదు.. హిందీలోను తనకు ఇప్పుడు అవకాశాల్లేవ్. ఇటీవలే అమెరికన్ మైఖేల్ డోలన్ ని పెళ్లాడి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. పీనిక్స్ డోలన్ అనేది వారసుడి పేరు.