1000 కోట్ల ఆశలు.. వచ్చింది మాత్రం 150 కోట్లు!

అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో కేవలం 150 కోట్ల కలెక్షన్స్ మాత్రమే అందుకొని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. 250 కోట్ల బడ్జెట్ తో ఇండియన్ 2 సినిమాని శంకర్ చేశారు. పెట్టిన పెట్టుబడిలో 70 శాతం కూడా ఈ మూవీ రికవరీ చేయలేదు.

Update: 2024-08-02 05:12 GMT

రాజమౌళి కంటే ముందు సౌత్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ అనే ఇమేజ్ ని అందుకున్న వ్యక్తి అంటే శంకర్ అని చెప్పాలి. ఆయన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళీ భాషలలో కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకున్నాయి. రోబో మూవీ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా శంకర్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. రోబో తర్వాత శంకర్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. వాటిని అందుకోవడంలో శంకర్ విఫలం అవుతూ వస్తున్నారు.

ఇండియన్ 2 మూవీ అయితే శంకర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. రోబో తర్వాత చేసిన భారీ బడ్జెట్ చిత్రాలైన ఐ, 2.ఓ మూవీస్ కాన్సెప్ట్ ల పరంగా పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాయి. బడ్జెట్ ఎక్కువ కావడంతో అవి కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇప్పటికి ఆ సినిమాలని ఇంటరెస్ట్ గా చూసేవారున్నారు. అయితే ఇండియన్ 2 సినిమా కథ విషయంలో కూడా శంకర్ ప్రేక్షకులని మెప్పించలేకపోయారని చెప్పాలి. 28 ఏళ్ళ క్రితం శంకర్, కమల్ హాసన్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ఇండియన్ కి సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కింది.

దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మూవీ 2017లో స్టార్ట్ అయ్యింది. అనేక అవాంతరాల తర్వాత రిలీజ్ అయ్యింది. రెండు భాగాలుగా ఈ సీక్వెల్ ని శంకర్ తెరకెక్కించారు. భారతీయుడు 2 మూవీ 1000 కోట్ల కలెక్షన్ అందుకుంటుందని కోలీవుడ్ ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో కేవలం 150 కోట్ల కలెక్షన్స్ మాత్రమే అందుకొని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. 250 కోట్ల బడ్జెట్ తో ఇండియన్ 2 సినిమాని శంకర్ చేశారు. పెట్టిన పెట్టుబడిలో 70 శాతం కూడా ఈ మూవీ రికవరీ చేయలేదు.

నిజానికి సౌత్ లో భారీ బడ్జెట్ చిత్రాలని నిర్మించడం మొదలైంది కోలీవుడ్ లోనే, శంకర్, మురుగదాస్ లాంటి దర్శకులు భారీ కథలని చెప్పడం స్టార్ట్ చేశారు. వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి కోలీవుడ్ నిర్మాతలు సిద్ధమయ్యారు. ఇండియాలోనే ఫస్ట్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ‘రోబో’ శంకర్ దర్శకత్వంలోనే వచ్చింది. తరువాత ‘2.0’ ఏకంగా 500+ కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కల్కికి ముందు వరకు ఇదే ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ చిత్రం. 1000 కోట్ల గ్రాస్ అందుకోవడంలో మాత్రం కోలీవుడ్ వెనుకబడింది. టాలీవుడ్ నుంచి రాజమౌళి బాహుబలి 2 తో సౌత్ నుంచి మొట్టమొదటి 1000 కోట్ల కలెక్షన్స్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

నెక్స్ట్ శాండిల్ వుడ్ నుంచి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 తో 1000 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నాడు. కోలీవుడ్ లో ఇప్పటికి హైయెస్ట్ కలెక్షన్స్ అంటే శంకర్ 2.0 చిత్రం పేరుమీదనే ఉంది. ఈ సినిమా 700+ కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఆ తరువాత జైలర్ మూవీ 600+ కోట్ల కలెక్షన్స్ సాధించింది. 1000 కోట్ల కలెక్షన్స్ ఇండియన్ 2తో వస్తాయని భావించిన నిరాశే ఎదురైంది. నెక్స్ట్ కంగువ మూవీ మాత్రం కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News