'ఇండియ‌న్-2' ని ఎక్కిస్తారా? అలాగే వ‌దిలేస్తారా?

`భార‌తీయుడి`కి సీక్వెల్ గా `ఇండియ‌న్-2` ప్ర‌క‌టించ‌గానే ఏ రేంజ్ లో బ‌జ్ క్రియేట్ అయిందో తెలిసిందే.

Update: 2024-07-03 10:52 GMT

`భార‌తీయుడి`కి సీక్వెల్ గా `ఇండియ‌న్-2` ప్ర‌క‌టించ‌గానే ఏ రేంజ్ లో బ‌జ్ క్రియేట్ అయిందో తెలిసిందే. చాలా కాలానికి శంక‌ర్ -క‌మ‌ల్ హాస‌న్ చేతులు క‌ల‌ప‌డంతో? అది సంచ‌ల‌న సినిమా అవుతుంద‌ని ఇండియా అంతా భావించింది. ముఖ్యంగా తెలుగులో సినిమాపై ఓ రేంజ్ బ‌జ్ వ‌చ్చింది. పైగా ఆ సినిమాకి దిల్ రాజు నిర్మాత‌గా ప్ర‌క‌టించ‌డంతో అంచ‌నాలు ఇంకా రెట్టింపు అయ్యాయి. కానీ ఆయ‌న అనివార్య కార‌ణాల‌తో త‌ప్పుకున్నాడు అనుకోండి.

అటుపై లైకా ప్రొడ‌క్ష‌న్స్ టేక‌ప్ చేయ‌డం...మ‌ధ్య‌లో వివాదాలు, బ్రేక్ రావ‌డం జ‌రిగిన తంతు అంతా తెలిసిందే. ఎలాగూ చిట్ట చివ‌రికి అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఈనెల 12న రిలీజ్ అవుతుంది. మ‌రి ఈ సినిమాపై తాజా ప‌రిస్థితి ఏంటి? సినిమా మార్కెట్ లో ఎలాంటి ఊపు తీసుకొస్తుంది? అంటే ఇంకా ఏం క‌నిపించ‌న‌ట్లే ఉంది. సేనాప‌తి లుక్..ట్రైల‌ర్ ఒకే . కానీ ఇండియ‌న్ -2 కిది స‌రిపోదు. ఓవైబ్ రావాలి. శంక‌ర్ సినిమా అంటే ఇండియా అంత‌టా ఓ సంచ‌ల‌నంగా మారుతుంది.

పైగా క‌మ‌ల్ హాస‌న్ హీరో అంటే ఎలా ఉండాలి? కానీ ఆ ఎగ్జైట్ మెంట్ బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌లే శంక‌ర్, క‌మ‌ల్ హాస‌న్ హైద‌రాబాద్ వ‌చ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టారు గానీ, అది పెద్ద‌గా రీచ్ అవ్వ‌లేదు. దీంతో సినిమా ఆడియ‌న్స్ లోకి బ‌లంగా వెళ్లిన‌ట్లు అనిపించ‌లేద‌నే విమ‌ర్శ వినిపిస్తుంది. రిలీజ్ కి ఇంకా ప‌ది రోజులే స‌మ‌యం ఉంది. ఈలోగా సినిమాకి హైప్ తీసుకురావాల్సిన బాధ్య‌త అంతా చిత్ర యూనిట్ పై ఉంది.

భారీ ఎత్తున ప్ర‌మోష‌న్ చేస్తే రీచ్ ఎక్కువ‌గా ఉంటుంది. లేదంటే? రిలీజ్ త‌ర్వాత రిజ‌ల్ట్ మాత్ర‌మే మాట్లాడాలి. అలా జ‌రిగితే ముందు ఓపెనింగ్స్ పై ప్ర‌భావం ప‌డుతుంద‌న్న‌ది యూనిట్ గుర్తించుకోవాల్సిన విష‌యం. పైగా మార్కెట్ లో క‌ల్కీ 2898 నుంచి పోటీ ఉంది. దాన్ని త‌ట్టుకుని నిలబ‌డాలంటే ప్ర‌మోష‌న్ పీక్స్ లో చేయాలి.

Tags:    

Similar News