భారతీయుడు 2.. టాలీవుడ్ టార్గెట్ ఎంత?

తెలుగులో ఈ సినిమాపై 20 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగిందంట. కమల్ హాసన్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది తక్కువ బిజినెస్ అని చెప్పొచ్చు.

Update: 2024-07-03 04:02 GMT

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా కల్కి మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. విలన్ గా ఈ సినిమా అతనికి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. అతనిని ఎందుకు అందరూ యూనివర్సల్ యాక్టర్ అంటారో కల్కి మూవీ ద్వారా మరోసారి కమల్ హాసన్ చూపించారు. ఆయన నుంచి చివరిగా వచ్చిన విక్రమ్ మూవీ కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చాలా ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ కి విక్రమ్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ లభించింది.

ఇదిలా ఉంటే ఆయన నుంచి జులై 12న ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తెలుగులో భారతీయుడు 2 పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ అన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది.

తెలుగులో ఈ సినిమాపై 20 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ జరిగిందంట. కమల్ హాసన్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఇది తక్కువ బిజినెస్ అని చెప్పొచ్చు. అయితే విక్రమ్ రూపంలో ఆయనకి సక్సెస్ వచ్చిన గత సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. అలాగే భారతీయుడు రిలీజ్ అయిన 28 ఏళ్ళ తర్వాత ఈ సీక్వెల్ వస్తోంది. దీంతో చెప్పుకోదగ్గ బజ్ అయితే మూవీపై క్రియేట్ కాలేదు. కానీ శంకర్ ఏదో ఒక అద్భుతం చేస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Read more!

తెలుగు తో పాటు హిందీలో కూడా మూవీకి చాలా తక్కువ థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాని నైజాం, ఉత్తరాంధ్రలో ఏషియన్ మూవీస్ రిలీజ్ చేస్తోంది. సీడెడ్ లో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఎన్.వి. ప్రసాద్ రిలీజ్ చేయబోతున్నారు. ఏషియన్ మూవీస్ కి తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ థియేటర్స్ ఉన్నాయి. కాబట్టి భారతీయుడు చిత్రాన్ని గ్రాండ్ గానే రిలీజ్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.

డైరెక్టర్ శంకర్ బ్రాండ్, భారతీయుడు మూవీ సక్సెస్ ఫ్లో, కమల్ హాసన్ ఇమేజ్ తో మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ ఈ చిత్రానికి వస్తాయని అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ లో ఎంత వరకు నిలబడుతుంది అనేది సినిమాకి వచ్చే మౌత్ టాక్ బట్టి తెలుస్తుంది. భారతీయుడు 2 తెలుగులో 21 కోట్ల షేర్ కలెక్షన్లు అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క. మరి ఆ టార్గెట్ ను ఎంత త్వరగా అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. అలాగే సేనాపతి క్యారెక్టర్ లో కమల్ హాసన్ విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నాడు.

Tags:    

Similar News

eac