'ఇండియన్‌ 2' కి ఇదేం తలనొప్పి బాబోయ్‌..!

దర్శకుడు శంకర్‌ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించాడు

Update: 2024-07-03 16:30 GMT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ అభిమానులతో పాటు సగటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఇండియన్‌ 2'. తెలుగు లో భారతీయుడు గా విడుదల అవుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

దర్శకుడు శంకర్‌ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించాడు. సమాజంలో పెరుగుతున్న అవినీతి పై యుద్దం అన్నట్లుగా ఈ సినిమా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు గట్టిగా చెబుతున్నారు. వెయ్యి కోట్ల టార్గెట్‌ తో ఈనెల 12న ఇండియన్ 2 వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద దాడికి సిద్ధం అయ్యింది.

తమిళ్‌ తో పాటు ఇతర భాషల్లో ఇండియన్ 2 కి పెద్దగా పోటీ ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇతర సినిమాలకు థియేటర్లు లభించే అవకాశం ఉండదు. అందుకే ఇతర సినిమాల రిలీజ్ లేకుంటే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.

కానీ అనూహ్యంగా ఇండియన్ 2 విడుదల అవ్వబోతున్న రోజునే 'టీన్జ్‌' అనే సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. యుగానికి ఒక్కడు సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ నటుడు పార్ధీబన్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం తో అంచనాలు బాగానే ఉన్నాయి.

Read more!

చిన్న సినిమా అయినా కూడా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా కొంత మేరకు ప్రభావం చూపిస్తుంది అంటూ ఆ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు. టీన్జ్‌ సినిమాను ఇండియన్ 2 కి పోటీగా విడుదల చేయడం అనేది చాలా పెద్ద నిర్ణయం, అలాగే తప్పుడు నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

చిత్ర యూనిట్‌ సభ్యులు బయటకు కనిపించకున్నా లోపల మాత్రం ఎందుకు ఈ టీన్జ్ ఇప్పుడే రావాలి అన్నట్టుగా ఇబ్బంది పడుతున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కమల్‌ సినిమా ముందు ఆ సినిమా నిలవడం సాధ్యం కాదు, కానీ పోటీ లేకుంటే బాగుంటుంది కదా అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Tags:    

Similar News

eac