పారితోషికాల్లో టాప్ 10 భారతీయ హీరోలు
దక్షిణ భారత సినిమా ఇటీవలి కాలంలో ప్రధాన స్రవంతిలో డామినేషన్ కొనసాగించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది
నిన్న మొన్నటి వరకూ భారతీయ సినీపరిశ్రమ అంటే హిందీ చిత్రసీమే. ఇప్పుడు సీన్ మారింది కానీ, హిందీ స్టార్లు తాము మాత్రమే గొప్పవాళ్లం అనుకుని జబ్బలు చరుచుకునే పరిస్థితి ఉండేది. భారతదేశంలో హిందీ మాట్లాడే ప్రేక్షకులే అత్యధికంగా ఉండడంతో హిందీ చిత్రసీమ ప్రధాన చిత్రసీమగా ఏలింది. హిందీ అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే భాష. అందువల్ల అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ తారలలో కొందరు బాలీవుడ్ నుండి ఉన్నారనడంలో ఆశ్చర్యం లేదు. అయితే జనాల నమ్మకానికి విరుద్ధంగా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ -10 భారతీయ నటులలో చాలామంది దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలే ఉండడం ఆశ్చర్యకరం.
దక్షిణ భారత సినిమా ఇటీవలి కాలంలో ప్రధాన స్రవంతిలో డామినేషన్ కొనసాగించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యాక్షన్ ప్యాక్డ్ కథాంశాలతో దేశవ్యాప్తంగా ఉన్న మాస్‌ని ఒక ఊపు ఊపేస్తున్నారు. అన్ని భారతీయ ప్రాంతాల ప్రేక్షకులను ఆకర్షించే పరిశ్రమగా దక్షిణాది ఎదిగింది. దక్షిణాది చాలా కాలంగా దేశవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. ఫలితంగా దక్షిణ భారత తారలు అత్యధిక పారితోషికం అందుకునే టాప్ 10 భారతీయ నటుల జాబితాలోకి ప్రవేశించారు.
అత్యంత భారీగా ఆర్జించే భారతీయ నటుల జాబితాను పరిశీలిస్తే వివరాలు ఇలా ఉన్నాయి.
IMDb డేటా ప్రకారం..పారితోషికాల్లో టాప్ 10 భారతీయ హీరోలు:
1. షారుక్ ఖాన్ రూ.150 కోట్లు-250 కోట్లు
2. రజనీకాంత్ రూ.150 కోట్లు-210 కోట్లు
3. దళపతి విజయ్ రూ.130 కోట్లు-200 కోట్లు
4. ప్రభాస్ రూ.100 కోట్లు-200 కోట్లు
5. అమీర్ ఖాన్ రూ.100 కోట్లు-175 కోట్లు
6. సల్మాన్ ఖాన్ రూ.100 కోట్లు-150 కోట్లు
7. కమల్ హాసన్ రూ.100 కోట్లు-150 కోట్లు
8. అల్లు అర్జున్ రూ.100 కోట్లు-125 కోట్లు
9. అక్షయ్ కుమార్ రూ.60 కోట్లు-145 కోట్లు
10. అజిత్ కుమార్ రూ.105 కోట్లు
ఆర్.ఆర్.ఆర్ తర్వాత 100 కోట్లు అందుకుంటున్న స్టార్లుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాఇ. అత్యధిక పారితోషికం పొందుతున్న భారతీయ నటులను నిశితంగా పరిశీలిస్తే
ఇప్పుడు ఈ హీరోలు అంత సంపాదించడానికి కారణం ఏమిటి? అంటే...వారంతా బహుముఖ ప్రజ్ఞ.. సుదీర్ఘ కాలం భారీ ఫాలోయింగ్ ని కొనసాగించడం వంటి అంశాలే ఈ క్రేజ్ కి కారణం.
షారుఖ్ ఖాన్ నికర ఆస్తుల విలువ: రూ. 6300 కోట్లు. కింగ్ ఖాన్ షారుఖ్ తన కెరీర్ లో కొన్ని పెద్ద ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. అయితే 2023లో జవాన్ - పఠాన్- డంకీ లాంటి వరుస బ్లాక్‌బస్టర్‌లను అందించాడు. మూడు సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా రూ.2500 కోట్లు ఒకే ఏడాదిలో వసూలు చేసిన హీరో అయ్యాడు ఖాన్. 1980ల చివరలో టెలివిజన్ సీరియళ్లతో కెరీర్ ప్రారంభించి, 1992లో దీవానాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన షారుఖ్ ఖాన్ తన కెరీర్‌ను మొదటి నుండి ఉత్కంఠభరితంగా నిర్మించుకున్నాడు. రికార్డులను వేటాడటం అతడికే చెల్లింది. అత్యధిక పారితోషికం పొందే బాలీవుడ్ స్టార్‌గా తన స్థానాన్ని స్థిరంగా నిలుపుకున్నాడు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ని మించి దళపతి విజయ్ ఆస్తులను సంపాదించాడు. భారీ పారితోషికాలు అందుకుంటున్నాడు.
టాలీవుడ్ నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తూ 100 కోట్లు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ వంటి సీనియర్లు 100కోట్లు పైగా వసూలు చేస్తున్నారు. ఇటీవలే రేసులోకి వచ్చిన అల్లు అర్జున్ కూడా 100 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్నాడని టాక్ ఉంది. తళా అజిత్ కూడా వంద కోట్లు అందుకునే హీరోల జాబితాలో నిలిచాడు. ఖిలాడీ అక్షయ్ ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేస్తాడు గనుక పారితోషికంలో కొంత దిగి వస్తాడు. అతడు 60 -145 కోట్ల వరకూ వసూలు చేస్తాడని సమాచారం.